31.2 C
Hyderabad
April 19, 2024 06: 31 AM
Slider ముఖ్యంశాలు

బాబు మాటలు నయా పెత్తందారీ భావజాలానికి ప్రతీక…!

#YSJAGAN

“ఎస్సీ కులాల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అని ఎస్సీలను.. బీసీల తోకలు కత్తిరిస్తామని బీసీలను.. కోడలు మగపిల్లాడని కంటానంటే అత్త వద్దంటుందా అని మహిళలని.. మూడు రాజధానులు వద్దని అన్ని ప్రాంతాలను.. సర్కారు బడుల్లో ఇంగ్లీష్ మీడియం వద్ద మొత్తం పేదల వర్గాలను అవమానించిన చంద్రబాబుది ఏ రకమైన మనస్తత్వమో ప్రజలందరికీ తెలుసు. చంద్రబాబు తన పాలనలో పేదలకు ఒక్క సెంటు భూమి అయినా ఇచ్చిన పాపాన పోలేదు.

మనందరి ప్రభుత్వంలో ఇస్తుంటే అన్ని కోర్టుల్లో కేసులు వేయిస్తున్నారు. “అమరావతిలో పేదలకు ఇళ్లిస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని.. చంద్రబాబు రూపం మార్చుకున్న అంటరానితనానికి, నయా పెత్తందారీ భావజాలానికి తెరతీశారు. చంద్రబాబు అండ్ కో, దుష్టచతుష్టం, గజదొంగల ముఠాగా అధికారం కోసం ప్రజలను మరోసారి మాయమాటలతో మోసగించే ప్రయత్నం చేస్తున్నారు.

విశాఖలో చంద్రబాబు పేదల గురించి మాట్లాడిన మాటలు పేద వర్గాలకు మరింత బాధ కలిగించాయి. పేదలకు శాశ్విత చిరునామాలుగా మారుతున్న ఇళ్లను, ప్రభుత్వం అందిస్తున్న ఇళ్ల స్థలాల రూపంలో ఇస్తున్న గోప్ప పవిత్ర స్థలాలను సమాధులు, స్మశానాలతో పోల్చి మన పేదలను దారుణంగా అవమానించారు. ఇలాంటి చంద్రబాబుకు మానవత్వం ఉందా అని ప్రజలు ఆలోచించాలని” మచలీపట్నం పోర్టు నిర్మాణ పనుల ప్రారంభోత్సవ సభలో సీఎం జగన్ ఈ మాటలను అన్నారు. ప్రతిష్టాత్మకమైన మంచలీపట్నం పోర్టు నిర్మాణ పనులను సీఎం జగన్ ప్రారంభించారు.

పోర్టు నిర్మాణ ప్రదేశంలో భూమి పూజచేసి పైలాన్‌ను ఆవిష్కరించారు. సీఎం జగన్‌ మంచలీపట్నం పోర్టు నిర్మాణ పనులు ప్రారంభించడంతో.. కృష్ణాజిల్లా తీర ప్రాంతంలో సరికొత్త అభివృద్ధికి నాంది పలికినట్లైంది. దీంతో పాటు తపసిపూడి తీరంలో బ్రేక్‌ వాటర్‌ పనులు సీఎం జగన్‌ లాంఛనంగా ప్రారంభించారు.

అంతకు ముందు సీఎం జగన్ సముద్రం వద్ద గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ బందరు మరో ముంబై.. చెన్నైగా ఎదుగుతుందని తెలిసినా అది ఒక నెరవేరని కలగా ఉండేదని ఈ పరిస్థితిని పూర్తిగా మారుస్తూ మన ప్రభుత్వం కోర్టు కేసులను అధిగమించి, భూసేకరణ పూర్తి చేసి అన్ని అనుమతులతో మచలీపట్నం పోర్టు నిర్మాణ పనులు ప్రారంభిస్తున్నామని సీఎం జగన్ అన్నారు.

మచలీపట్నం పోర్టు ప్రస్తుతం 35 మిలియన్ టన్నుల సామర్థ్యంతో ప్రారంభమై 116 మిలియన్ టన్నుల వరకు విస్తరించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని పేర్కొన్నారు. మచలీపట్నం పోర్టు అన్ని రకాలుగా అభివృద్ధి జరిగేలా పూర్తి స్థాయిలో రోడ్డు, రైలు కనెక్టివిటీ అందిస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు.

రాబోయే రోజుల్లో కృష్ణాజిల్లా చరిత్రను మార్చేలా ఈ మచలీపట్నం పోర్టు తయారుకానుందని, మన రాష్ర్టమే కాకుండా పక్క రాష్ర్టాలైన తెలంగాణ, చత్తీసఘడ్ రాష్ర్టాలకు కూడా పోర్టు ఉపయోగపడనుందని పేర్కొన్నారు. పోర్టు నిర్మాణంతో వేల మందికి యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు రానున్నాయని వివరించారు. పోర్టు నిర్మాణం పూర్తైతే డిగ్రీలు పూర్తి చేసిన పిల్లలు ఎక్కడికో వెళ్లకుండా మచలీపట్నంలోనే ఉద్యోగులు చేసుకునే పరిస్థితి వస్తుందని హామీ ఇచ్చారు.

అమరావతి కోసం మచిలీపట్నం పోర్టు బలి

గత టీడీపీ ప్రభుత్వం నుంచి నేటి వరకు మచలీపట్నం పోర్టు నిర్మాణం జరగకుండా చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేశారని సీఎం జగన్ విమర్శించారు. పోర్టు ప్రాంతంలోని వేల ఎకరాలను సాగుదారుల నుంచి దూరం చేసి పోర్టు నిర్మాణం జరగకుండా అడ్డకున్నారని మండిపడ్డారు. మచలీపట్నంలో పోర్టు నిర్మాణం జరగకుంటే అమరావతిలోని తన బినామీల చేతుల్లో ఉన్న భూములకు మంచి రేట్లు వస్తాయనే క్రూరమైన ఆలోచనతో మచలీపట్నం ప్రజలకు తీరని ద్రోహం చేశారని విమర్శించారు.

కానీ మన వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రతి రైతు ముఖంలో చిరునవ్వు చూసేలా భూములు తీసుకోవాలని మాజీ మంత్రి పేర్ని నానికి చెప్పానని, ఇదే తరహాలో మొత్తం భూసేకరణ కార్యక్రమం పూర్తి చేసి నిర్మాణ పనులు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. రాబోయే రోజుల్లో పోర్టు ఆధారిత పరిశ్రమలకు మచలీపట్నం పునాది కానుందన్నారు.

ప్రభుత్వ ఆధీనంలో ఉన్న 4 వేల ఎకరాలను పోర్టు ఆధారిత పరిశ్రమల కోసం వినియోగిస్తామని వివరించారు. మరో 24 నెలల్లో ఇదే సముద్రంలో పెద్ద ఓడలు కనిపిస్తాయని చెప్పడానికి సంతోషిస్తున్నట్లు పేర్కొన్నారు.

4 ఏళ్ల పాలనలో 4 గ్రీన్ ఫీల్డ్ పోర్టులు

దీంతో పాటు మచలీపట్నంలో 550 కోట్లతో నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక మెడికల్ కాలేజీలో ఈ ఏడాదే అడ్మిషన్లు కూడా జరగనున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. అలాగే రూ. 420 కోట్లతో ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని, ఇప్పటికే 60 శాతం పనులు పూర్తైనట్లు వివిరంచారు.

రాష్ర్టంలో ఇప్పటి వరకు 4 చోట్ల 6 పోర్టులుంటే మనందరి ప్రభుత్వంలో కేవలం నాలుగేళ్లలో 16 వేల కోట్లతో 3 గ్రీన్ ఫీల్డ్ పోర్టులు రామాయపట్నం, మచలీపట్నం, మూలపేటలో నిర్మాణాలు జరిగేలా చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు.

దీంతో పాటు కాకినాడ వద్ద గేట్ వే పోర్టు నిర్మాణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనట్లు వివరించారు. ఈ నాలుగు పోర్టుల ద్వారా ప్రాథమికంగా కనీసం 20 వేల ఉద్యోగాలు వస్తాయని, పోర్టులు పూర్తిగా అందుబాటులోకి రాగానే లక్ష ఉద్యోగాలు.. పోర్టు ఆధారిత పరిశ్రమలు రానున్నట్లు సీఎం జగన్ వివరించారు.

“నా అక్క చెల్లెమ్మల చేతిలో లక్షన్నర కోట్ల ఆస్థి..”

రాష్ర్టంలో 31 లక్షల ఇళ్ల స్థలాల రూపంలో ఇప్పటికే 75 వేల కోట్ల ఆస్థిని నా అక్క చెల్లెమ్మలకు అందించడం జరిగని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ ఇళ్ల నిర్మాణం పూర్తైతే ఇంటి స్థలం, ఇంటి విలువను కనీసం 5 లక్షలుగా లెక్కిస్తే నా అక్క చెల్లెమ్మలకు లక్షన్నర కోట్ల ఆస్తిని అందిస్తున్నందుకు గర్వంగా ఉందని వివరించారు.

డీబీటీ నాన్ డీబీటీ పథకాల కింద ఈ నాలుగేళ్లలో నవరత్నాల పేరుతో ఏకంగా 3 లక్షల కోట్లు పేద ప్రజల ఖాతాలకు చేర్చామని చెప్పడానికి గర్వంగా ఉందని పేర్కొన్నారు. రాష్ర్టంలో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత లంచాలు, వివక్ష లేని సుపరిపాలనను సొంతూరులోనే అందించినట్లు వివరించారు.

పెన్షన్ మొదలు.. రైతులకు అవసరమైన వ్యవసాయ సేవల వరకు అన్ని సొంతూరులోనే అందేలా విప్లవాత్మక మార్పులు తెచ్చామన్నారు. నా పేదలు, అక్క చెల్లెమ్మలకు మరింత మంచి చేసేలా మనందరి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం జగన్ ప్రకటించారు.

“అమరావతిలో ఓ గజ దొంగల ముఠా..”

అమరావతితో మొదలై రాష్ర్టాన్ని దోచుకుతినేందుకు చంద్రబాబుకు తోడు ఎల్లో మీడియా, దత్తపుత్రుడు కలిసి గజ దొంగల ముఠా తయారైందని.. ఈ ముఠా అమరావతిలో పేదలను ఉండనీయకుండా గేటెడ్ కమ్యూనిటీ తరహాలో ఓ కోటను తయారు చేసుకునే ప్రయత్నం చేశారని సీఎం జగన్ మండిపడ్డారు. పేదలకు అందులో ప్రవేశం ఉండరాదని..

పేదలు ఈ పెత్తందారీల వద్ద పాచి పనులు మాత్రమే చేయాలనన్నట్లుగా, రోజు కూలీలుగా వచ్చి సాయంత్రానికి వెళ్లి పోవాలని భావించిన వ్యక్తే ఈ చంద్రబాబు అని విమర్శించారు. ఇంతకన్నా సామాజిక అన్యాయం ఇంకెక్కడైనా ఉంటుందా అని ప్రశ్నించారు. నా ఎస్సీలు, నా ఎస్టీ, నా బీసీలకు, నా నిరుపేద వర్గాలకు అన్యాయం చేస్తూ చంద్రబాబు వారిని పనివాళ్లగా మార్చాలని చూస్తున్న చంద్రబాబుకు ప్రజలు ఎందుకు మద్ధతు ఇస్తారని ప్రశ్నించారు.

చంద్రబాబు అహంకార ఆలోచనలను తుంగలో తొక్కేలా.. పేదల తలరాతను మార్చేలా అక్కడే అదే అమరావతిలో 50 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా ఇళ్లు కూడా కట్టించే ఓ మహోత్త్తర కార్యక్రమానికి ఈ నెల 26 వ తేదీన శ్రీకారం చుట్టబోతున్నట్లు సీఎం జగన్ వివరించారు.

నాటి శంకుస్థాపన ఓ పొలిటికల్ డ్రామా.. నేడు వాస్తవరూపంలో సకల అనుమతులతో పనులు ప్రారంభం

“గత టీడీపీ ప్రభుత్వం మచలీపట్నం పోర్టు నిర్మాణాన్ని పూర్తిగా ఓ పొలిటికల్ స్టంట్ గా మార్చేసింది. కేవలం రాజకీయ లబ్ధి కోసమే అనుమతులు కూడా పూర్తిగా రాకున్నా మాజీ సీఎం చంద్రబాబు మచిలీపట్నం పోర్టు నిర్మాణం కోసం శంకుస్థాపనలు చేశారు. పోర్టు నిర్మాణ శంకుస్థాపనను ఎన్నికలు వచ్చే నాటికి సరిగ్గా 2019 ఫిబ్రవరి 7వ తేదీన చేశారు.

పోర్టు నిర్మాణానికి అవసరమైన ఫైనాన్షియల్‌ క్లోజర్‌, పర్యావరణ అనుమతులు, పోర్టు కనెక్టివిటీ రహదారులు ఏమీ లేకుండా, కనీసం సెంటు భూమి కూడా సేకరించకుండానే కేవలం రాజకీయ లబ్ధికోసం హడావుడిగా శంకుస్థాపన చేశారు.

ఆ రోజు నిర్మించిన పైలాన్‌ను ఓ ప్రైవేటు వ్యక్తి స్థలంలో నిర్మించి ఆ రైతుకు కనీసం నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. కానీ నేడు మచలీపట్నం పోర్టు నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్ని అనుమతులను సమీకరించి, భూసేకరణ పూర్తి చేసి నిర్మాణ పనులను ప్రారంభిస్తున్నాం.” అని సీఎం జగన్ పేర్కొన్నారు.

మంచలీపట్నం పోర్టు నిర్మాణంతో జరిగే లాభాలివీ..

మంచలీపట్నం పోర్టు ద్వారా కీలకంగా రాష్ర్ట పోర్టు ఆధారిత వాణిజ్యం పెరగడంతో పాటు స్థానిక, స్థానికేతరులకు వేల సంఖ్యలో ఉపాధి లభించనుంది. సీఎం జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది పోర్టు నిర్మాణానికి 2020 ఫిబ్రవరి 4న మచిలీపట్నం పోర్టు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ పేరుతో ప్రత్యేక సంస్థ ఏర్పాటు చేశారు. 5,156 కోట్ల వ్యయంతో పోర్టు నిర్మాణానికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది.

ఈ ఏడాది ఫిబ్రవరి 28న పోర్టు నిర్మాణానికి కీలకమైన పర్యావరణ అనుమతులు, ఏప్రిల్‌ 13న కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు, 2023 మార్చిలో పోర్టు నిర్మాణం కోసం ప్రాథమికంగా అవసరమైన 1,923 ఎకరాల భూసేకరణ పూర్తైన తర్వాత నేడు సీఎం జగన్ మచలీపట్నం పోర్టు నిర్మాణం కోసం ఫైలాన్ ఆవిష్కరించి నిర్మాణ పనులను ప్రారంభించారు.

రాష్ట్రంలోని గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎరువులు, బొగ్గు, వంటనూనె, కంటైనర్ల దిగుమతులు, వ్యవసాయ ఉత్పత్తులు, సిమెంట్, సిమెంట్‌ క్లింకర్, గ్రానైట్, ముడి ఇనుము ఎగుమతులకు వేదికగా మారనుంది. 35.12 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యంతో రెండు జనరల్‌ కార్గోకు, ఒకటి బొగ్గుకు, మరొకటి మల్టీపర్పస్‌–కంటైనర్‌తో ఎగుమతి, దిగుమతులకు ఉపయోగపడేలా మొత్తం నాలుగు బెర్తులతో మచిలీపట్నం పోర్టును 24–30 నెలల్లో పూర్తిచేయనున్నారు. ఈ పోర్టు పనుల పూర్తితో ప్రత్యక్షంగా, పరోక్షంగా 25వేల మందికి ఉపాధి లభించనుంది.

వాణిజ్య కార్యకలాపాలు విస్తరించేకొద్దీ 16 బెర్తులతో 116 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యంతో పోర్టును విస్తరించేలా ప్రణాళిక రూపొందించుకున్నారు. సుమారు 16 వేల కోట్ల వ్యయంతో రాష్ర్టంలో మచిలీపట్నం, రామాయపట్నం, కాకినాడ గేట్‌వే, మూలపేట పోర్టుల నిర్మాణాల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 75 వేల మందికి ఉపాధి లభించనుంది.

Related posts

అభివృద్ధి పనులకు మంత్రి అజయ్ శంకుస్థాపన

Satyam NEWS

వైసీపీ ప్రభుత్వాన్ని కూలదోయాలని చూస్తున్న బిజెపి: పేర్ని నాని షాకింగ్ కామెంట్

Satyam NEWS

కెసిఆర్ ను కలిసిన సండ్ర

Bhavani

Leave a Comment