30.7 C
Hyderabad
April 24, 2024 02: 38 AM
Slider సంపాదకీయం

కమలానికి అటూ ఇటూ

#kcr

గత ఎన్నికల మాదిరిగా ఈ సారి వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు అందుతాయా? తాజా రాజకీయాల పరిణామాల నేపథ్యంలో ఈ ప్రశ్నకు లేదు అనే సమాధానం వస్తున్నది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తనపై ఆరోపణలు చేసిన తెలుగుదేశం పార్టీ అధినేత

చంద్రబాబునాయుడుపై కక్ష పెట్టుకున్న కేసీఆర్ ఆ తర్వాత జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో తన సంపూర్ణ సహకారాన్ని జగన్ కు అందించారు. చంద్రబాబునాయుడు రాజధానిని అమరావతికి తరలించి ఏపి నుంచి పాలన సాగించడంతో హైదరాబాద్ ఆదాయం పై అప్పటిలో తీవ్ర ప్రభావం పడింది. దీనికి తోడ హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రా వర్క్ ఫోర్సు మొత్తం అమరావతి తరలి వెళ్లింది. ఈ పరిణామాలతో అప్పటిలో హైదరాబాద్ లో చాలా కంపెనీలు, ఆఫీసుల కార్యకలాపాలకు వర్క్ ఫోర్సు లేకుండా పోయింది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఉన్నంత ఖరీదు అమరావతిలో

భూములకు ఏర్పడింది. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాగైనా చంద్రబాబుకు ‘‘రిటర్న్ గిఫ్ట్’’ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. పరిపాలనానుభవం లేని జగన్ ను ముఖ్యమంత్రిని చేస్తే హైదరాబాద్ కు పూర్వ వైభవం వస్తుందని కేసీఆర్ ఆలోచించారు. రాజకీయంగా చంద్రబాబుపై కక్ష పెంచుకున్న కేసీఆర్ హైదరాబాద్ కు పూర్వవైభవం తేవడంతో బాటు రాజకీయంగా కూడా పైచేయి సాధించాలంలే జగన్ కు అండగా నిలవాలని భావించారు.

జగన్ కూడా కేసీఆర్ చెప్పినట్లు వినేందుకు అంగీకరించడంతో కేసీఆర్ తన గేమ్ ప్రారంభించారు. హైదరాబాద్ లో ఉన్న తెలుగుదేశం నాయకులను బెదిరించడం, వారి వ్యాపారాలపై వత్తిడి పెంచడం ఆరంభించారు. హైదరాబాద్ లో ఉన్న వారి నుంచి ఆంధ్రాలో టీడీపీకి ఎలాంటి సహాయం అందకుండా చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత జరిగిన

పరిణామాలలో జగన్ ముఖ్యమంత్రి కాగానే కేసీఆర్ తన ప్లాన్ అమలు చేసుకున్నారు. దాంతో ఒక్క సారిగా అమరావతి పూర్తిగా మూలపడిపోయింది. హైదరాబాద్ లోని సచివాలయంలో ఉన్న కార్యాలయాలను కేసీఆర్ ముందే చెప్పినట్లు జగన్ వదిలేసి వచ్చేశారు. పోలవరం ముంపు గ్రామాల సమస్యను పరిష్కరించకుండా వదిలివేయడం, విలీన గ్రామాలను అనాధనలు చేయడంలో కేసీఆర్ ఆలోచన ప్రకారం జగన్ చేశారు. ఏపికి కొత్త పరిశ్రమలు రాకపోవడం, నిర్మాణ

కార్యకలాపాలు మందగించడంతో చంద్రబాబు హయాంలో అమరావతి తరలివ వెళ్లిన వర్క్ ఫోర్సు అంతా తిరిగి హైదరాబాద్ రావడం ప్రారంభం అయింది. ఆంధ్రా కు చెందిన నిరుద్యోగ యువకులు మళ్లీ హైదరాబాద్ రావడం ప్రారంభం కావడంతో హైదరాబాద్ కు వర్క్ ఫోర్సు సమస్యలు పూర్తిగా తగ్గిపోయాయి. కేసీఆర్ కు కావాల్సింది ఇదే.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా వెనుకబడిపోవడంతో తెలంగాణ బహుముఖ వ్యూహంతో ముందుకు వెళుతున్నది. ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో తీవ్రంగా వ్యతిరేకించడం ప్రారంభం అయింది. బీజేపీ కూడా కేసీఆర్ పై కత్తి దూసింది. బీజేపీ, జాతీయ పార్టీ బీఆర్ఎస్ గా మారిన టీఆర్ఎస్ ల మధ్య రాజకీయ వైరం

తారాస్థాయికి చేరింది. జాతీయ స్థాయిలో తన సత్తా చూపించాలనుకుంటున్న కేసీఆర్ తో కలిసి వచ్చేందుకు జగన్ పూర్తిగా వెనకడుగు వేశారు. అంతే కాకుండా తన వ్యక్తిగత ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా బీజేపీతో అంచనాకు కూడా మించిన సఖ్యతను కూడా జగన్ ప్రదర్శిస్తన్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రాలో జరుగుతున్న విధ్వంసకర పాలనపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు తరచూ విమర్శలు చేయడం ప్రారంభించారు.

ఆదిలో జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేసే వారికి ‘‘వద్దు’’ అంటూ ఆదేశాలు వచ్చేవి. అయితే తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో జగన్ మనకు ఇక అవసరం లేదు అనే పద్ధతిలోనే బీఆర్ఎస్ వ్యవహరిస్తున్నది. బీజేపీతో అంటకాగుతున్నందున జగన్ ను ఉపేక్షించాల్సిన అవసంర లేదనే భావన కూడా బీఆర్ఎస్ పార్టీ అగ్ర నేతలలో నెలకొన్నది. అందుకే రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, ఆర్ధిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావులు తరచూ జగన్ ప్రభుత్వాన్ని, ఆయన పాలనాతీరును ఎద్దేవా చేస్తున్నారు. రెండు మూడు సందర్భాలలో ‘‘ఇదేంటన్నా ఇలా చేస్తున్నారు’’

అంటూ ఏపి నుంచి కీలక నేతలు అడిగినా తెలంగాణ మంత్రుల నుంచి సానుకూల సమాధానం రాలేదని అంటున్నారు. జగన్ బీజేపీ పెద్దల కరుణాకటాక్ష వీక్షణాల కోసం ఢిల్లీ ప్రదక్షిణాలు చేయడం కేసీఆర్ కు చీకాకు తెప్పిస్తున్నది. దాంతో ఈ సారి ఎన్నికల్లో జగన్ కు సాయం చేయరాదని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది.

Related posts

ఎంత మంది గొంతు నొక్కుతారు?

Satyam NEWS

గ్రేట్ వర్క్: కానిస్టేబుల్ అన్నా నీకు శాల్యూట్

Satyam NEWS

ఆటకు పేదరికం అడ్డుకాకూడదు : ఒలింపిక్ అధ్యక్షులు బి.జి.ఆర్

Satyam NEWS

Leave a Comment