28.7 C
Hyderabad
April 25, 2024 06: 18 AM
Slider గుంటూరు

బైపాస్ రోడ్ లో లారీల ప్రయాణం నరకయాతన

#bypassroad

పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణంలోకి లారీలు ఇతర ట్రాన్స్పోర్ట్ వాహనాలు ప్రవేశించకుండా ఇతర మార్గం గుండా వెళ్లేందుకు గతంలో బైపాస్ రోడ్డు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఉన్న బైపాస్ రోడ్డు దుస్థితి రీత్యా ఆ రూట్లో లారీలు కానీ హెవీ వెహికల్స్ వెళ్లాలంటే నరక యాతన గా ఉందని లారీ డ్రైవర్లు చెబుతున్నారు. నరసరావుపేట దాటి ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే ఇబ్బందికరంగా ఉందని వారు చెప్పారు.

నరసరావుపేట వైపు వెళ్లాలన్నా రావాలన్నా లారీ డ్రైవర్లు భయపడుతున్నారని లారీ యజమానులు చెప్పారు. హెవీ లోడ్ వాహనదారులు నరసరావుపేట దాటాలంటే సరైన బైపాస్ లేకపోవడం వల్ల చాలా తీవ్రమైన ఇబ్బందులకు గురి అవుతున్నారు. లింగంగుంట మీదగా కొత్తగా వేసిన బైపాస్ మార్గంలో లారీ వాళ్ళు గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతుంది.

ఒక లారీ కూడా సరిగ్గా పోలేని మార్గం లో రెండు లారీలు ఎదురెదురు పడితే కనీసం పావు కిలో మీటర్ వెనక్కి రావాల్సిన పరిస్థితి ఉందని అంటున్నారు. సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే గుంటూరు రోడ్డు నుండి  రావిపాడు కు వెళ్లే బైపాస్ రోడ్డు పై అక్కడక్కడా గుంతలు ఏర్పడి చాలా దారుణంగా ఉంది.

ఏదైనా సరే దీనిమీద ప్రభుత్వం వారు దృష్టి పెట్టాలని కోరారు రాత్రి 10:30 దాటిన తరువాత కూడా లారీ వాళ్ళని నరసరావుపేట పట్టణం గుండా వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని తెలిపారు.

ఎం.ఎస్.సుధాకర్, సత్యంన్యూస్.నెట్, పల్నాడు జిల్లా

Related posts

జిల్లా అధికారులు సహాయక చర్యలు మరింత ముమ్మరం చెయ్యాలి

Satyam NEWS

సుధీర్ బాబు హీరోగా ‘హంట్’కు హాలీవుడ్ యాక్షన్ టచ్

Bhavani

నో రెస్పాన్స్: 30వ రోజుకు చేరిన అమరావతి నిరసనలు

Satyam NEWS

Leave a Comment