గంజాయి సేవించేవారు ఇకనుంచి తప్పించుకోలేరు. వారిని పట్టుకునేందుకు పోలీసులకు ఎట్టకేలకు ఒక కొత్త ఆయుధం చిక్కింది.గంజాయి టెస్ట్ కిట్లు త్వరలోనే అన్ని పోలీస్ స్టేషన్ లకు చేరనున్నాయి..డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలోనే,గంజాయి టెస్ట్ నిర్వహించి వాటికి బానిసైన వారిని పట్టుకోనున్నారు.రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొన్నేళ్లుగా డ్రగ్స్ గంజాయి వాడకం విచ్చలవిడిగా పెరిగిపోయింది..ఒకప్పుడు ముఖ్యమైన నగరాలు,పట్టణాలకే పరిమితమైన డ్రగ్స్,ఇప్పుడు మారుమూల గ్రామాలకు కూడా విస్తరించాయి..ఇక గంజాయి అయితే అన్ని గ్రామాల్లోనూ చాలా ఈజీగా దొరుకుతుంది.
కొందరైతే పెరటి తోటలో గంజాయిని సాగు చేస్తున్నారు..స్కూల్, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు కూడా సైతం గంజాయి కి బానిసలు అవుతున్నారు.ఏమీ తెలియని వయసులో మత్తుకు బానిసై నేరాలకు పాల్పడుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.భవిష్యత్తును పాడు చేసుకుని జైలు పాలవుతున్నారు.ఆంధ్ర,ఒడిస్సా బోర్డర్ తో పాటు విశాఖ ఏజెన్సీ నుంచి గంజాయి తెలుగు రాష్ట్రాలకు పెద్ద ఎత్తున సరఫరా అవుతున్నట్లు తెలిసింది.దీంతో తెలంగాణ పోలీసులు యాంటీ నార్కోటి బ్యూరో టీమ్లను ఏర్పాటు చేసి,గంజాయి మత్తు పదార్థాలను అక్రమ రవాణాకు చెక్ పెడుతున్నారు.. అయితే గంజాయిని పట్టుకుంటున్నారే గాని వాటిని సేవించే వారిని గుర్తించడం కష్టంగా మారింది.
మద్యం తాగి వెహికల్ నడిపే వారిని గుర్తించేందుకు పోలీసులు బ్రీత్ అనలైజర్ ను ఉపయోగిస్తుంటారు. అయితే గంజాయి సేవించే వారిని గుర్తించేందుకు నిన్నటి వరకు ఎటువంటి మిషిన్లు అందుబాటులో లేవు.అయితే ఇకనుంచి గంజాయి తాగే వారు పోలీసుల నుంచి తప్పించుకోలేరు.వారి చేతికి ఆయుధాలు చిక్కాయి. గంజాయి తాగే వారిని గుర్తించేందుకు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు గంజాయి టెస్ట్ కిట్టను అందిస్తున్నారు.ఇందులో భాగంగా పైలెట్ ప్రాజెక్టుగా నల్గొండ జిల్లా మునుగోడులో ఈ కిట్లను పరీక్షిస్తున్నారు.రెండు రోజుల క్రితం పోలీసులకు పట్టుబడిన కొందరికి టెస్ట్ కిట్లతో పరీక్షించగా,వారిలో 35 మంది గంజాయి తాగినట్లు తేలింది.
దీంతో గంజాయి సప్లై చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.త్వరలో రాష్ట్ర మొత్తం అన్ని పోలీస్ స్టేషన్లోనూ గంజాయి కిట్లను పంపిణీ చేస్తామని వెల్లడించారు.డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలోనే ఈ కిట్లతో పరీక్షలు నిర్వహిస్తామన్నారు..గంజాయి సేవించేవారు ఇక తప్పించుకోలేరని పోలీసులు హెచ్చరించారు. గంజాయి సరఫరా కు అడ్డాగా మారిన ధూల్ పేటను గంజాయి ఫ్రీగా మార్చాలని ఎక్సైజ్ ఎన్ఫోర్మెంట్స్ డైరెక్టర్ కమలహాసన్ రెడ్డి సిబ్బందిని ఆదేశించారు..ఆగష్టు 31 లోగా ధూల్ పేట ను గంజాయి ఫ్రీగా మార్చాలన్నారు. దూల్పేటకు గంజాయి ఎక్కడినుండి వస్తుంది? ఎవరు తీసుకొస్తున్నారు? ఎలా తీసుకొస్తున్నారు? కొనుగోలు?విషయాలపై నిగా పెట్టాలన్నారు. పోలీసుల సహకారంతో గంజాయి అక్రమార్కులపై ఉక్కు పాదం మోపాలన్నారు…సో గంజాయి అమ్మేవారే కాదు, తాగేవారు కూడా ఇకపై ఆషామాషి కాదని గ్రహించాలి.