31.2 C
Hyderabad
January 21, 2025 15: 06 PM
Slider ముఖ్యంశాలు

ఈసారి సరికొత్తగా:మళ్ళీ మార్కెట్ లోకి బజాజ్ చేతక్

bajaj chetak

ఒకప్పుడు భారత ద్విచక్ర వాహన మార్కెట్లో బజాజ్ చేతక్ దే ఆధిపత్యం అంటే అతిశయోక్తి కాదు. అన్ని వర్గాల ప్రజలను అలరించిన స్కూటర్ గా చేతక్ కు ఎంతో గుర్తింపు లభించింది. అయితే కాలక్రమంలో తెరమరుగైనా, ఇప్పుడు సరికొత్తగా మళ్లీ రోడ్లపై పరుగులు తీసేందుకు సన్నద్ధమవుతోంది. బజాజ్ కంపెనీ తన పాతకాపు చేతక్ ను ఎలక్ట్రిక్ స్కూటర్ గా మలిచింది. ఈ కొత్త బండి జనవరి 14న మార్కెట్లోకి రానుంది. పుణేలో ప్రారంభం కానున్న అమ్మకాలను ఆపై క్రమంగా ఇతర నగరాలకు విస్తరించాలని బజాజ్ ఆటో భావిస్తోంది. అయితే బుకింగ్స్ మాత్రం స్కూటర్ మార్కెట్లోకి వచ్చిన తర్వాతే ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. దీని ఎక్స్ షోరూం ధర రూ.1.20 లక్షలు పలికే అవకాశముందని మార్కెట్ వర్గాలంటున్నాయి.

Related posts

ఎడ్ల సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం

mamatha

నేస్తం పౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పెన్నులు, ప్యాడ్స్ పంపిణీ

Satyam NEWS

ప్రతిభగల మహిళలను అందరూ ఆదర్శంగా తీసుకోవాలి

Satyam NEWS

Leave a Comment