32.2 C
Hyderabad
March 28, 2024 23: 42 PM
Slider నల్గొండ

త్యాగానికి ప్రతీకైన బక్రీద్ ను భక్తి శ్రద్ధలతో జరుపుకున్న ముస్లింలు

#bakreed

దేశ వ్యాప్తంగా జరుగుతున్న బక్రీద్ పండుగను బుధవారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఉస్మానియా పెద్ద మసీదులో కోవిడ్  నిబంధనలను పాటిస్తూ పరిమితి సంఖ్యలో మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

హుజూర్ నగర్  ముస్లిం సోదరుల మత పెద్ద ముఫ్తి మహ్మద్ గౌసుద్ధిన్  ఆధ్వర్యంలో బక్రీద్ పండుగ నమాజ్, ఈదుల్ అధా ప్రార్థనను భౌతిక దూరం పాటిస్తూ మసీదులో భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేసిన పిదప గౌసుద్దీన్ మాట్లాడుతూ దైవ ప్రవక్తలో ఒకరైన హజ్రత్ ఇబ్రహీం ఇస్లాం వాలే కి వృద్దాప్యంలో లేకలేక కలిగిన తన ప్రియ తనయుడు హజ్రత్ ఇస్మాయిల్ ఆలయ త్యాగ నిరతిని స్మరించుకుంటూ జరుపుకునే పండుగే బక్రీద్ పండుగ అని అన్నారు.

ఒకరోజున అల్లా హజ్రత్ ఇబ్రహీం ఇస్లాంకి కలలో కనిపించి నీ కుమారుడు హజ్రత్ ఇస్మాయిల్ ను దైవమార్గంలో మీ కుమారుడిని బలి ఇవ్వాలి అని అడగగానే వెంటనే ఇట్టి విషయాన్ని  తన కుమారుడికి చెప్పాడని,కుమారుడు మీ ఆదేశాల్ని తూచా తప్పకుండా పాటిస్తానని బలికి సిద్ధపడ్డాడని,తండ్రి వెంటనే కుమారుడిని బలి ఇవ్వడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశారని అప్పుడు ఏర్పడ్డ ఈ బక్రీద్ పండగ త్యాగానికి ప్రతీక అని అన్నారు.

ప్రపంచ మానవాళిని అనారోగ్యాల పాలు చేస్తున్న కరోనా మహమ్మారిని ఈ ఊరు,జిల్లా,రాష్ట్రం,దేశం,ఈ ప్రపంచం నుండి అల్లా దయతో తరిమి వేయాలని అల్లాను ప్రత్యేకంగా ప్రార్ధించామని అన్నారు.మంచి వర్షాలు కురిసి,వ్యవసాయ పంటలు సమృద్ధిగా పండాలని, వ్యాపారాలు సజావుగా సాగాలని, విపత్కర పరిస్థితులు పునరావృతం కాకుండా అందరి జీవితాల్లో సుఖ,శాంతులు వెల్లివిరియాలని అల్లాను ప్రార్ధించామని అన్నారు.

బక్రీద్ పండుగ విశిష్టతను  వివరిస్తూ మహమ్మద్ ప్రవక్త  బోధించిన సమైక్యత,సోదర భావాన్ని అందరు  అనుసరించాలని,శాంతి,సహనంతో సమస్త మానవాళి ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని,త్యాగం,భక్తి,విశ్వాసానికి శాంతి మార్గమని,విశ్వ మానవ సౌభ్రాతృత్వనికి ప్రతీకగా ఏర్పడిందే బక్రీద్ పండగ అని గౌసుద్దీన్ ముస్లిం సోదరులకు వివరించారు.ప్రార్థనల అనంతరం భౌతిక దూరం పాటిస్తూ చేతులు ఊపుతూ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు ఒకరికొకరు ఆనందంతో తెలుపుకున్నారు.

ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ రాష్ట్ర నాయకులు ఎండి. అజీజ్  పాషా,ఎస్.కె.మన్సూర్అలీ ఎస్ కె.బాజీఉల్లా,ఎస్.కె. సైదా మేస్త్రీ, షేక్ బిక్కన్ సాహెబ్,రహమతుల్లా,షేక్ జానీ పాషా,ఎస్.కె. మోహిన్,సిరాజ్, ఎండి.సలావుద్దీన్,ఎస్ కె.భాషా,మౌలాలి, రహీం,అలీ,మీరా,జావేద్,ఎండి.నయీమ్, నజీర్ తదితర ముస్లిం సోదరులు  పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

బాడ్ కరోనా :ప్రముఖ విద్య వేత్త కుమారా స్వామి మృతి

Satyam NEWS

దు:ఖపు మచ్చ

Satyam NEWS

నో అప్పాయింట్ మెంట్ :మొన్న కేసీఆర్ నిన్న జగన్

Satyam NEWS

Leave a Comment