27.7 C
Hyderabad
April 26, 2024 03: 39 AM
Slider అనంతపురం

అభిమాని కుమార్తె వివాహానికి హాజరైన బాలయ్య

#nandamuribalakrishna

తెదేపా పోలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటులు, నందమూరి బాలకృష్ణ తన అభిమాన సంఘం అధ్యక్షుడి కుమార్తె వివాహానికి హజరై అందరిని ఆశ్చర్యపరిచారు. అనంతపురంలో హీరో బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షుడు గౌస్ మొహిద్దీన్ కుమార్తె వివాహం జరిగింది. ఈ కల్యాణోత్సవానికి బాలకృష్ణ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. నగర శివారులోని ఎం.వై.ఆర్ ఫంక్షన్ హాల్​లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి హీరో బాలకృష్ణ పాల్గొనడంతో అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బాలయ్య రాకతో పెళ్లిలో సందడి నెలకొంది. గౌస్ మొహిద్దీన్ తెదేపా కార్యకర్తగా ఉంటూ గతంలో గ్రంథాలయ ఛైర్మన్​గా పని చేశారు. ఈ కార్యక్రమానికి తెదేపా పోలిట్ బ్యూరో సభ్యులు,  మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు, పరిటాల సునీత ఇతర నాయకులు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.

Related posts

డ్రైవర్‌ కే కాదు ,వెనుక కూర్చున్న వ్యక్తికీ హెల్మెట్ ఉండాల్సిందే

Satyam NEWS

గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు మరో ఉద్యమానికి శ్రీకారం

Bhavani

ఓటింగ్ సరళిని పరిశీలిస్తున్న విజయనగరం ఎస్పీ…!

Satyam NEWS

Leave a Comment