28.7 C
Hyderabad
April 20, 2024 07: 05 AM
Slider నెల్లూరు

హాపీ బర్త్ డే: నిప్పులాంటి మనిషి నందమూరి బాలకృష్ణ

#Nellore TDP

నందమూరి తారక రామారావు తరువాత సాంఘిక, పౌరాణిక, జానపద, చారిత్రాత్మక పత్రాలు పోషించి మెప్పించిన ఏకైక నటుడు  నందమూరి బాలకృష్ణేనని నెల్లూరు జిల్లా జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి  చేజర్ల వెంకటేశ్వర రెడ్డి అన్నారు.

నందమూరి బాలకృష్ణ 60 వ జన్మదిన సందర్భంగా కోవూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన బాలకృష్ణ జన్మదిన వేడుకలు లో ముఖ్య అతిధిగా పాల్గొని కేక్ కట్ చేసారు. అనంతరం  వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ నందమూరి బాలకృష్ణ నటుడిగా ఈతరం లో ఏ నటుడు చేయని విధంగా అన్ని రకాల పాత్రలు చేసి ప్రేక్షకులకు మెప్పించారని ఆయన అన్నారు.

తన కుటుంబ సభ్యులు అధికారాన్ని అడ్డు పెట్టుకొని అవినీతి చేస్తున్న నాయకులు ఉన్న ఈరోజులలో, తన తండ్రి, బావ 20 సంవత్సరాలకు పైగా ముఖ్యమంత్రి గా ఉన్న ఏనాడు అధికార వ్యవహారాలలో జోక్యం చేసుకోని నిప్పులాంటి మనిషి బాలయ్య అని అన్నారు.

అదేవిధంగా  తన తల్లి పేరు మీద ఉన్న బసవతారకం కాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా రాష్ట్రంలో కేన్సర్ రోగులకు విశేషమైన సేవలు చేస్తున్నారని, ఎంతో మంది పేదలకు ఉచితంగా కేన్సర్ హాస్పిటల్ ద్వారా  వైద్యం అందిస్తున్నారని,అటువంటి బాలకృష్ణ మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ వారికి నందమూరి అభిమానుల తరపున కోవూరు తెలుగుదేశం తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నామని అన్నారు.

అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నందమూరి కుటుంబం అభిమానులకు అభినందనలు తెలియచేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బాలక్రిష్ణ అభిమానులు మారుబోయిన వెంకటేశ్వర్లు, బుధవరపు శివకుమార్ పాల్గొన్నారు.

ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకులు ఏలూరు కృష్ణయ్య,పెనుమల్లి శ్రీహరి రెడ్డి,దారా విజయబాబు, ఇందుపురు మురళీకృష్ణ రెడ్డి,సాయి రోశయ్య,అగ్గి మురళి,బత్తల రమేష్,ఎస్కె నాసీర్,కలికి సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఆసరా లేని వారికి అనురాగ్ హెల్పింగ్ సొసైటీ సాయం

Satyam NEWS

చిన్న కుటుంబం చింతలేని కుటుంబం

Satyam NEWS

జ‌న‌వ‌రి 11న‌ శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Satyam NEWS

Leave a Comment