32.2 C
Hyderabad
March 29, 2024 00: 17 AM
Slider హైదరాబాద్

క్యాన్సర్ హాస్పిటల్ లో గణేష్ చతుర్ధి జరిపిన బాలకృష్ణ

#nandamuribalakrishna

గణేష్ చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకొని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ లో వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.  నేటి ఉదయం హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన వినాయకునికి బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు.  పూజానంతరం ప్రసాద వితరణ చేశారు. 

ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ తెలుగు ప్రజలకు ప్రత్యేక వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.  ప్రజలెదుర్కొంటున్న విఘ్నాలన్నీ తొలగిపోవాలని ఆకాంక్షించారు. 

ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ తో పాటూ డా. ఆర్ వి ప్రభాకర రావు, CEO, BIACH&RI; డా. ఫణి కోటేశ్వర రావు, మెడికల్ సూపర్నింటెండెంట్, BIACH&RI లతో పాటూ హాస్పిటల్ కు చెందిన వైద్యులు, వైద్యేతర సిబ్బంది పాల్గొన్నారు.  అంతకు ముందు హాస్పిటల్ ఆవరణలో ఉన్న గణేష్ మందిరంలో బాలకృష్ణ ప్రత్యేక పూజలు చేశారు.

Related posts

గ్రామ సచివాలయంకు వాటర్ కూలర్ వితరణ

Satyam NEWS

నెల్లూరుకు దక్కిన పిఎం కిసాన్ అవార్డు

Satyam NEWS

పెట్రోలు బంకు యాజమాన్యం బెదిరింపులతో మహిళ ఆత్మహత్యాయత్నం

Satyam NEWS

Leave a Comment