హిందూపూర్ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణను వైసీపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో హిందూపూర్‌లోని రహమతపురం సర్కిల్‌లో ఉద్రిక్తత నెలకొంది. బాలయ్య వాహనాన్ని వైసీపీ కార్యకర్తలు అడ్డుకోగా వారిని పోలీసులు పక్కకు తోసేశారు.
బాలకృష్ణ అభిమానులు ముందుకు తోసుకు రావడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు బాలకృష్ణకు మద్దతుగా టీడీపీ కార్యకర్తలు భారీగా ఘటనా స్థలానికి చేరుకున్నారు.