35.2 C
Hyderabad
April 20, 2024 17: 33 PM
Slider ప్రకాశం

బావ మీద కోపంతో బాలకృష్ణ సినిమాకు అడ్డంకులు

#Balakrishna'

చలనచిత్ర పరిశ్రమపై దెబ్బమీదదెబ్బ కొట్టిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇంకా ఆ పట్టువీడడం లేదనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ‘‘బావ మీద రాజకీయ కక్షతో బావమరిదిపై’’ చర్యలు తీసుకుంటున్నారని కూడా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. తెలుగుదేశం పార్టీని కట్టడి చేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం సభలు సమావేశాలు, రోడ్ షో లు నిర్వహించడాన్ని నిషేధిస్తూ కొత్త సంవత్సరపు తొలి రోజే ఒక జీవోను తీసుకువచ్చిన విషయం తెలిసిందే.

జీవోను కారణంగా చూపించి తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్. చంద్రబాబునాయుడు తన సొంత నియోజకవర్గం అయిన కుప్పం కు వెళితే అక్కడ పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపధ్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలు ABM గ్రౌండ్ లో ఈనెల ఆరవ తేదీన తలపెట్టిన నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి ఫ్రీ రిలీజ్ ప్రోగ్రాం పై కూడా పోలీసులు కఠిన వైఖరి అవలంబిస్తున్నారు. నిజానికి రాజకీయ పార్టీలకు, సినిమా ప్రోగ్రామ్ లకు ఎలాంటి సంబంధం ఉండకూడదు.

పోలీసులు కూడా రెండు వేరువేరుగా చూడాలి. అయితే ఈ సినిమా నందమూరి బాలకృష్ణది కావడంతో రెండూ కలిపి చూస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చిత్ర యూనిట్ మొత్తం ఎంతో శ్రమకోర్చి ABM గ్రౌండ్లో అన్ని ఏర్పాట్లు చేసుకున్నది. ప్రభుత్వానికి చలానా కూడా చెల్లించింది. నిన్న చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ ఏర్పాటుచేసి అన్ని ఏర్పాట్లు చేసినట్టు వివరణ కూడా ఇచ్చింది. ఏమేం ఏర్పాటు చేశామో కూడా చిత్ర యూనిట్ వివరించింది.

కేవలం పాస్ లు ఉన్నవారు మాత్రమే రావాలని కూడా ప్రకటించారు. అయినా సరే నిన్న సాయంత్రం మూడు గంటలకి వీరసింహారెడ్డి ఫ్రీ రిలీజ్ కార్యక్రమానికి అనుమతి నిరాకరిస్తూ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. కార్యక్రమానికి వచ్చే అభిమానుల వలన ట్రాఫిక్ ఇబ్బంది, విఐపిలు నివసించే రహదారి అని, వచ్చే అభిమానులకు గ్రౌండ్ సరిపోదు అని పర్మిషన్ నిరాకరించారు. ABM గ్రౌండ్ స్థలం మొత్తం 20 ఎకరాలు.

దీనిలో ఇంచుమించు ఎనిమిది ఎకరాలు స్థలం లో ఎంతోమంది రాజకీయ నాయకులు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షరాలు సోనియాగాంధీ, వైయస్ రాజశేఖర్ రెడ్డి, అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్, కల్వరి టెంపుల్ పాస్టర్ సతీష్ కుమార్ సువార్త సభలు ఏర్పాటు చేస్తే వేల మంది ప్రజలు ఈ గ్రౌండ్లో పాల్గొనేవారు. అలాంటిది. వీరసింహ రెడ్డి ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ నిరాకరించడంతో బాలకృష్ణ అభిమానుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. ABM గ్రౌండ్లో జరుగుతున్న ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ రాజకీయ ఒత్తిడి వల్లే పర్మిషన్ నిరాకరించారని ప్రచారం జరిగింది.

Related posts

జగన్ జిల్లా పర్యటన వల్ల ఒరిగింది ఏమీ లేదు

Bhavani

ఎదుర్లంక- యానం బాలయోగి వారధిపై ఘోర రోడ్డు ప్రమాదం

Satyam NEWS

మొక్కుబడి చర్చలు తప్ప ఫలితం లేదు

Satyam NEWS

Leave a Comment