37.2 C
Hyderabad
March 28, 2024 19: 38 PM
Slider ప్రత్యేకం

పాకిస్తాన్ కు సమాచారం లీక్: డీఆర్ఢీఓ ఉద్యోగుల అరెస్ట్

#drdo

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో DRDO ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌కు చెందిన నలుగురు కాంట్రాక్టు ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని తొలుత విచారణ కోసం అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. విచారణ అనంతరం వీరంతా అనుమానిత పాకిస్తాన్ ఏజెంట్లకు సమాచారాన్ని పంపినట్లు రుజువైందని, అరెస్టు చేశామని పేర్కొన్నారు.

వివిధ ఐఎస్డీ ఫోన్ నెంబర్లతో విదేశీ ఏజెంట్లకు రక్షణ రహస్యాలను అందిస్తున్నట్లుగా తమకు సమాచారం అందిందని, దీనిపై నిఘా అనంతరం ఈ నలుగురిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. సమాచార చేరవేతతో వీరంతా డబ్బులు పొందారని,  దేశ భద్రత, సార్వభౌమత్వం, సమగ్రతకు తీవ్ర హాని కలిగించే నేరాలకు పాల్పడ్డారని తేలిందని పేర్కొన్నారు.

వీరిపై వివిధ సెక్షన్ల కింద కేసులు చంఢీపూర్ పోలీస్ స్టేషన్ లో నమోదయ్యాయి. దీనిపై DRDO అధికారులను సంప్రదించగా, పోలీసుల ఆరోపణలను పరిశీలిస్తున్నామని తెలిపారు. అయితే ఈ ఘటనపై వ్యాఖ్యానించేది లేదని చెప్పారు.

అయితే 2014లో బాలాసోర్‌లో కాంట్రాక్ట్ ఫోటోగ్రాఫర్, ఈశ్వర్ బెహరా, టెస్ట్ రేంజ్ పై సమాచారాన్ని లీక్ చేస్తున్నట్లు గుర్తించిన తర్వాత అతడిని అరెస్ట్ చేశారు. కాగా సెషన్స్ కోర్టు అతడికి జీవిత ఖైదు విధించింది.

Related posts

కాణిపాకం చైర్మన్ పీఠం దక్కేది ఎవరికి ?

Satyam NEWS

అట్టహాసంగా మొదలు కానున్న తెలంగాణ కుంభమేళా

Satyam NEWS

ఇద్దరిపై హత్యాయత్నం కేసు నమోదు

Bhavani

Leave a Comment