28.7 C
Hyderabad
April 20, 2024 05: 27 AM
Slider హైదరాబాద్

బల్కంపేట్ ఎల్లమ్మ కళ్యాణానికి భక్తులు రావద్దు

#Minister Talasani Srinivasyadav

రోజురోజుకు కరోనా మహమ్మారి  విస్తరిస్తున్న నేపద్యంలో  ఈ నెల 23 వ తేదీన  బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణాన్ని ఆలయంలోనే వేదపండితుల సమక్షంలోనే నిర్వహించాలని నిర్ణయించినట్లు పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి,  మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి  తలసాని శ్రీనివాస్ యాదవ్  వెల్లడించారు.

శనివారం మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయ ఆవరణలోని సమావేశ మందిరంలో దేవాదాయ, ghmc, పోలీసు తదితర శాఖల అధికారులు, కార్పొరేటర్లు, కమిటీ సభ్యులు తదితరులతో జరిగిన సమావేశంలో నిర్ణయించారు.

ఈ సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, కార్పొరేటర్లు నామన శేషుకుమారి, కొలన్ లక్ష్మి, సెంట్రల్ జోన్ జోనల్ కమిషనర్ ప్రావిణ్య, పంజాగుట్ట acp తిరుపతన్న, ఆలయ eo శర్మ, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తామని, ప్రతి  సంవత్సరం అమ్మవారి కళ్యాణాన్ని తిలకించేందుకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తారని తెలిపారు.

ప్రభుత్వ ఆదేశాలను దృష్టిలో ఉంచుకొని వేదపండితులు, ఆలయ అధికారుల సమక్షంలో ఆలయంలో ఈ సారి నిర్వహిస్తామని అన్నారు. అమ్మవారి కళ్యాణాన్ని భక్తులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని వివరించారు.

కళ్యాణం అనంతరం రోజు అనగా 24 వ తేదీన రదోత్సవాన్ని కూడా ఆలయంలోనే నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సమావేశంలో పాల్గొన్న ఆలయ ట్రస్టీ సాయిబాబా గౌడ్,  కమిటీ సభ్యులు తదితరులు మాట్లాడుతూ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపద్యంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు తాము అన్ని విధాలుగా సహకరిస్తామని స్పష్టం చేశారు. 

పరిస్థితులను దృషిలో ఉంచుకొని భక్తులు కూడా సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం అమ్మవారి కళ్యాణానికి వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించే దాతలు కూడా ఈ సంవత్సరం ఎలాంటి ఏర్పాట్లు చేయవద్దని మంత్రి కోరారు.

ఆలయం ముందు శాశ్వత రేకుల షెడ్డును దాతల సహకారంతో నిర్మిస్తున్నట్లు, ఆలయానికి వచ్చే భక్తుల వాహానాల పార్కింగ్ కోసం ఆలయం పక్కనే 5 కోట్ల రూపాయల ఖర్చుతో  మల్టి లెవెల్ పార్కింగ్ ను నిర్మించనున్నట్లు తెలిపారు. సుమారు 7 కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టిన వైట్ టాపింగ్ రోడ్డు మద్యలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు, డివైడర్ల మద్య మొక్కలు నాటి ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు.

అదేవిధంగా పతేనగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి ని నాలుగు  లేన్లుగా విస్తరించి నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇంకా ఈ సమావేశంలో trs,bjp, tdp, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కుమార్, నారాయణ రాజు, వనం శ్రీనివాస్, అశోక్ యాదవ్, హన్మంతరావు,  ఉమానాద్ గౌడ్, శ్రీనివాస్ గుప్తా, బొద్దు కుమార్, రవీందర్ గౌడ్, బిక్షపతి, రాజు గౌడ్, పృద్విరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

తొలి చార్జిషీట్ లో మనీష్ సిసోడియా పేరు లేదు

Satyam NEWS

బిక్కు బిక్కు మంటున్న లంక గ్రామాల ప్రజలు

Satyam NEWS

నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పై బదిలీ వేటు

Satyam NEWS

Leave a Comment