27.7 C
Hyderabad
March 29, 2024 02: 30 AM
Slider విజయనగరం

ప్లాస్టిక్ రహిత సమాజం కోసం..

#plasticban

వచ్చే నెల అంటే నవంబర్ ఫస్ట్ నుంచి ప్లాస్టిక్ ను నిషేధించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు. విజయనగరం    జిల్లా కలెక్టర్ సూర్య కుమారి తదనుగుణంగా నే ఇటీవలే తన ఛాంబర్ లో సమావేశం నిర్వహించి మరీ..ప్లాస్టిక్ రహిత జిల్లా గా ఉంచాలని నిర్ణయం తీసుకుని…అన్నింటా పాటించాలని ఆదేశాలు కూడా ఇచ్చారు. ముఖ్యంగా స్వచ్ఛంద సంస్థ లు..ఎన్.జీ.ఓలు…దీనిపై ప్రజలలో అవగాహన కోసం చర్యలు చేపట్టాలని చెప్పారు కూడా. దరిమిలా జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల…ప్రభుత్వ ఆఫీసు లలో హైస్కూలు, కాలేజీ క్యాంపస్ లలో ప్లాస్టిక్ ఏరివేత పై సంబంధిత సంస్థ చర్యలు తీసుకోవడం ప్రారంభించాయి.

అందులో భాగంగా జిల్లాలో ని డెంకాడ లో ఉన్న ఎంవీజీఆర్ కాలేజీ..బీ టెక్ చదువు తూ ఎన్.సీ.సీ. ఉన్న విద్యార్ధినీలు ప్రత్యూషతో పాటు తోటి విద్యార్ధినీలు…లెక్చరర్ సూచనలతో కాలేజీ క్యాంపస్ మరియు పరిసర ప్రాంతాల్లో ప్లాస్టిక్ ఏరివేత కు శ్రీకారం చుట్టారు. గత కొద్ది రోజుల నుంచీ.. కాలేజీ లో ఎన్.సీ.సీ స్టూడెంట్స్ అంతా కలిసి ఈ ప్లాస్టిక్ ఏరవితేకు నడుం బిగించారు. ఏదైనా.. మార్పు విద్యార్ది దశ నుంచీ మోదలవ్వాలని అన్నట్లు ఎంవీజీఆర్ విద్యార్ధినీలు చేస్తున్న ఈ కృషి… లెక్చరర్ సహాయం తో చేయడాన్ని సత్యంన్యూస్.నెట్ అభినందిస్తోంది.

Related posts

ఉప్పల్ భగాయత్లో వంజర సంఘం భవనానికి శంకుస్థాపన

Bhavani

సిజెఐ ని కలిసిన గోరేటి

Sub Editor 2

వికలాంగుల సదస్సును జయప్రదం చేయాలి

Satyam NEWS

Leave a Comment