27.7 C
Hyderabad
April 20, 2024 02: 14 AM
Slider కడప

రెండు వేల కుటుంబాలకు మూడు టన్నుల అరటి పండ్లు

Kadapa CPI

విపత్కర పరిస్థితుల్లో పేదల ఆకలి తీర్చడమే లక్ష్యం గా సిపిఐ ఆధ్వర్యంలో కడప నగరంలో  3 వేల టన్నుల అరటి పండ్లను 2 వేల కుటుంబాలకు ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ అశోక్ కుమార్ సహకారంతో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని సిపిఐ జిల్లా కార్యదర్శి  జి.ఈశ్వరయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.

శుక్రవారం అశోక హాస్పిటల్ వద్ద 3 టన్నుల అరటి పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని అశోక్ కుమార్  ప్రారంభించారు. వీరితో పాటు సిపిఎం రాష్ట్ర నాయకులు నారాయణ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు సత్తార్, హేతువాద సంఘం నాయకులు సిఆర్ వి ప్రసాద్ తదితరులున్నారు.

అనంతరం నగరం లోని వివిధ పేదల కాలనీలల్లో ఇంటింటి కి డజనుకు పైబడి అరటి పండ్లను పంచిపెట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ అశోక్ కుమార్,ఈశ్వరయ్య మాట్లాడుతూ కరోనా వైరస్ ప్రభావంతో  దేశమంతా లాక్ డౌన్ పాటిస్తుoడటంతో పేద ప్రజలు, వలస కార్మికులు, అనాధలు,అభాగ్యులు ఉపాధి కోల్పోయి రోజు గడవక నానా ఇబ్బందులు పడుతున్నారు.

ఆకలి దప్పులతో అల్లాడుతున్న వారికి దాతల సహకారంతో  సీపీఐ చేయూత కొనసాగుతున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న మొక్కుబడి అర కొర సాయం కాకుండా విరివిగా ఆహార, నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలి.

రైతులు పండించిన  పంటలకు గిట్టుబాటు ధరల తో పాటు రవాణా సౌకర్యాలు కల్పించాలి. కరోనా మహమ్మారి పై పోరు సాగిస్తున్న వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుద్ధ కార్మికులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, పోలీసులు, జర్నలిస్టులకు  ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు ఇవ్వాలని వారు కోరారు.

సిపిఐ నగర కార్యదర్శి యన్. వెంకటశివ ,సుబ్రమణ్యం, రైతు సంఘం నాయకులు చంద్ర, దస్తగిరి రెడ్డి AITUC నాయకులు బాదుల్లా, సిపిఐ నాయకులు సావంత్ సుధాకర్, నాగరాజు, మునయ్య, లింగన్న ,ఆర్  బాబు, భాగ్యలక్ష్మి ,బాలు, దస్తగిరి, వలరాజు, పవన్, Gv సురేష్, లక్ష్మీనారాయణ, సుధాకర్, నారాయణ, బుజ్జి, బ్రాహ్మo తదితరులు పాల్గొన్నారు.

Related posts

మరింత పెరిగిన మన తెలుగు సినిమా ఖ్యాతి

Satyam NEWS

అభినయంతో ఆహా అనిపించిన స్నిగ్ధ

Satyam NEWS

POK కూడా జమ్ముకశ్మీర్‌లో భాగమే

Satyam NEWS

Leave a Comment