30.7 C
Hyderabad
April 24, 2024 00: 33 AM
Slider ఆదిలాబాద్

విద్యార్థుల ప్రాణాలతో సీఎం కేసీఆర్ చెలగాటం

బాసర త్రిబుల్ ఐటీ విద్యార్థుల విషయంలో ప్రభుత్వం బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఇది మూడో సారో… నాలుగో సారో ఫుడ్ పాయిజన్ అవ్వడం. విద్యార్థుల సమస్యలు వినే ఆలోచన సీఎం కెసిఆర్ కు లేదు. విద్యార్థులు చదువుకుందాం అంటే… వాళ్లను బెదిరిస్తున్నాడు, వాళ్లపై కేసులు పెడుతుండు. పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయితే వాళ్లను హాస్పిటల్ కు తీసుకెళ్తే… తాను బదనాం అయిత అని చెప్పి, వాళ్ళను తీసుకెళ్ళకుండా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న దగుల్బాజీ, బట్టేబాజ్ పాలన తెలంగాణ రాష్ట్రంలో ఉంది అని బండి విరుచుకుపడ్డారు.

వెంటనే విద్యార్థులకు ట్రీట్మెంట్ చేయించాలి.పిల్లల ప్రాణాలతో చెలగాటమాడితే… బిడ్డా నీ సంగతేంటో చూస్తాం.కేసీఆర్ గుర్తుంచుకో… నీ చుట్టపోడు కాంట్రాక్టర్ గా ఉన్నాడని పిల్లలకు ట్రీట్మెంట్ చేయించకుండా ఉంటే ఊరుకునేది లేదు. పాపం వట్టిగానే పోదు… నీ పాలలో ఏంటో ప్రజలు చూస్తున్నారు అని ఆయన అన్నారు.

Related posts

కరోనిల్ ఉత్పత్తిలో అన్ని నిబంధనలు పాటించాం

Satyam NEWS

ఫర్ సొసైటీ: బిహార్‌లోభారీ మానవహారం

Satyam NEWS

తెలంగాణ రాష్ట్రం లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు

Bhavani

Leave a Comment