సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్‌ను బెదిరించిన కేసులో నిర్మాత బండ్ల గణేష్ ను జూబ్లిహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 4వ తేదీ రాత్రి తన అనుచరులతో కలిసి వెళ్లిన గణేష్ వైసీపీ నేత, సినీ నిర్మాత పుట్లూరు వరప్రసాద్ ను బెదిరించారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన టెంపర్ చిత్రానికి సంబంధించి రూ. 30 కోట్లు పెట్టుబడిగా బండ్ల గణేష్ కు ప్రొడ్యూసర్ పొట్లూరి వరప్రసాద్ ఇచ్చారు. అయితే సినిమా విడుదల సమయంలో కొంత మొత్తాన్ని చెల్లించిన గణేష్, మిగతా మొత్తానికి చెక్కులను అందజేశారు. అయితే పూర్తిగా డబ్బులు చెల్లించలేదని, మిగతా డబ్బులు ఇవ్వాలని గణేష్ ను వరప్రసాద్ కోరారు. దీంతో డబ్బులు అడుగుతావా? అంటూ గణేష్ తన అనుచరులతో కలిసి పొట్లూరిని బెదిరించారు వరప్రసాద్ ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు 420, 448, 506 r/w 43 ipc సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. అయితే అప్పటి నుంచి గణేష్ పరారీలో ఉన్నాడు. పరారీలో ఉన్న బండ్ల గణేష్ ను నేడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయనను బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయానికి తరలించారు. ఇది ఇలా ఉండగా బండ్ల గణేష్ ఫై వేరే కేసుకు సంబంధించి కడప జిల్లా మేజిస్ట్రేట్ అరెస్ట్ వారెంట్ ఇచ్చారు. అయితే గత కొంతకాలం గా అతను కోర్ట్ కు హాజరు కావడంలేదు. అందువల్ల బండ్ల గణేష్ ని కడప కు తరలించే అవకాశం కూడా ఉంది.
previous post