33.2 C
Hyderabad
April 26, 2024 01: 42 AM
Slider హైదరాబాద్

పోలీసు కార్యాలయాల్లో కరోనా రక్షణ చర్యలు

#Banjarahills ACP office

ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉన్న పోలీసులు తరచూ కరోనా వైరస్ బారిన పడటం చూస్తూనే ఉన్నాం. ఎంత మంది వైరస్ బారిన పడినా సరే పోలీసుల విధినిర్వహణ ఆగడానికి వీల్లేదు. అందుకోసమే సాధ్యమైన అన్ని చర్యలను పోలీసులు తీసుకుంటున్నారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి వ్యక్తికి కరోనా పరీక్షలు చేయడం సాధ్యం కాదు.

అదే విధంగా వారిని పోలీస్ స్టేషన్ కు రావద్దని చెప్పేందుకు వీలు లేదు. అందువల్ల పోలీసులు తమ జాగ్రత్తలో తాము ఉంటూ ప్రజలకు సేవలు అందిస్తున్నారు. హైబరాబాద్ బంజారాహిల్స్ ఏసిపి కార్యాలయంలో కనిపించిన దృశ్యం ఇది. వచ్చిన వారు భౌతిక దూరం పాటించడం ఈ కార్యాలయంలో తప్పని సరి చేశారు.

వచ్చిన వారు దూరంగా కూర్చుని మాట్లాడాల్సి ఉంటుంది. అదే విధంగా వచ్చిన వ్యక్తులు తమ సమస్యలు చెప్పే సమయంలో వారి నుంచి వైరస్ వ్యాప్తి చెందకుండా టేబుల్ పై గ్లాస్ పార్టిషన్ కూడా ఏర్పాటు చేశారు. ఈ మాత్రం కనీస జాగ్రత్తలు తీసుకుని తమ విధులను నిర్వర్తిస్తున్న పోలీసులను అభినందించక తప్పదు.

Related posts

19 నుంచి సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు ప్రారంభం

Satyam NEWS

పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Sub Editor

వివాహ వ‌య‌సు పెంచితే.. కొంద‌రికి బాధ

Sub Editor

Leave a Comment