37.2 C
Hyderabad
March 28, 2024 17: 29 PM
Slider కృష్ణ

నూజివీడులో బ్యాంకు ఉద్యోగుల ఆందోళన ర్యాలీ

#Banks

కృష్ణాజిల్లా నూజివీడు పట్టణంలో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో ఆందోళన ర్యాలి నిర్వహించారు. తక్షణం కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల ప్రైవేటీకరణను విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు. పట్టణంలోని ప్రజలకు బ్యాంకుల ప్రైవేటీకరణను వల్ల జరిగే నష్టాలను వివరించిన కరపత్రాలను వారు పంపిణీ చేశారు.

రాబోయే తరాలకు ఉద్యోగాలు ఉద్యోగ భద్రత ఉండదు, బ్యాంకులో డిపాజిట్లకు బరోసా ఉండదు, రుణాల మీద వడ్డీ భారం పెరుగుతుంది, ఉచితంగా అందించే సేవలు అంతరించి పోతాయి,ఇతర సేవల మీద పన్ను భారం పెరుగుతుంది, కనీస కాతా నిల్వలు కూడా భారీగా పెరిగి పోతాయి అంటూ వారు నినాదాలు చేశారు.

ఆన్లైన్ సేవలపై ప్రత్యేక వడ్డింపులు ఉంటాయి, సామాన్యులకు బ్యాంకింగ్ సేవలు అవుతాయి,కొన్ని బ్యాంకులు బ్రాంచీలు కూడా మూతపడతాయని వారు తెలిపారు. గతంలో దివాలా తీసిన ప్రైవేటు బ్యాంకులకు ఒకసారి గుర్తు తెచ్చుకోండి అంటూ ప్రజల్లో అవగాహన కల్పిస్తూ బ్యాంకు ఉద్యోగులు ర్యాలీ సాగింది.

Related posts

ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ అప్పాజీ కి దాసరి ప్రతిభా పురస్కారం

Satyam NEWS

గుంటూరులో 13 బైకులను తగులబెట్టిన ఆకతాయిలు

Satyam NEWS

అంగన్వాడీ కేంద్రాలకు ఫ్లేవర్డ్ మిల్క్ అందజేత

Murali Krishna

Leave a Comment