అతనొక బ్యాంకు కు మేనేజర్ అయితేనేం కనీసమైన జీవకారుణ్యం లేదు. బేగంపేటలోని హెచ్‌డీఎఎఫ్‌సీ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేస్తున్న అవినాష్ బాపూనగర్‌లో నివాసం ఉంటున్నారు. పక్కింటిలో ఉండే పెంపుడు కుక్క తన ఇంట్లోకి వస్తోందనే కోపంతో తన వద్ద ఉన్న ఎయిర్‌గన్‌తో కాల్చేశాడు.
ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కుక్క యజమాని రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అవినాష్‌ను అదుపులోకి తీసుకున్నారు. అవినాష్ గతేడాది బషీర్‌బాగ్‌లో రూ.18వేలకు ఎయిర్‌గన్ కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.