నిషేధిత గుట్కాలు రవాణా చేస్తున్నారని సమాచారంతో పేరకల పాడు వద్ద జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు రెండు కార్లలో సుమారు 10 లక్షల 40 వేల రూపాయల విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్లు రవాణా చేస్తూ 8 మంది వ్యక్తులు పట్టుబడ్డారు. పట్టుబడిన వ్యక్తులతో పాటు గుట్కా ప్యాకెట్ల తో సహా రెండు కార్లను రెండు బైకులు కంచికచర్ల పోలీస్ స్టేషన్ కు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
previous post