నిర్మల్ జిల్లా బాసర లోని శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారు బ్రహ్మచారిణి రూపంలో నేడు దర్శనం ఇస్తున్నారు. దశరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈ రోజు ఉదయం నుంచి అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఈ రోజు రెండవ రోజు అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారి సన్నిధిలో వారి చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తూ కుటుంబ సభ్యులతో కలిసి పలువరు అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. భక్తి శ్రద్ధలతో దేవిని ప్రార్ధించి అమ్మవారి ఆశీర్వాదం పొందుతున్నారు. ఈ రోజు అమ్మవారు బ్రహ్మచారిణి రూపంలో దర్శనం ఇవ్వడం విశేషం.
previous post