32.7 C
Hyderabad
March 29, 2024 11: 12 AM
Slider నిజామాబాద్ ముఖ్యంశాలు

మెనూ పాటించని త్రిబుల్ ఐటి మెస్ నిర్వాహకులు

basara iiit

బాసర ట్రిపుల్ ఐటి యూనివర్సిటీలో విద్యార్థులకు అందించే మెనూ ను మిస్ నిర్వాహకులు పాటించడంలేదు. గతంలో 6000  విద్యార్థులకు యూనివర్సిటీ అధికారులు రెండు మెస్ లను ఏర్పాటు చేశారు. గతంలో ఒక్కో మెస్ ఒక్కో విద్యార్థికి 69 రూపాయలు చెల్లించేలా టెండర్ దాఖలు చేశారు. అప్పుడు సైతం విద్యార్థులకు సరైన మెనూ అందక విద్యార్థులు పలు మార్లు ఆందోళన చేసినా యూనివర్సిటీ అధికారులు మెస్ నిర్వాహకులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రెండు రోజులుగా త్రిబుల్ ఐటీ యూనివర్సిటీలో 7000 వేల మంది విద్యార్థులకు సరైన మెనూ అమలు చేయకపోవడంతో విద్యార్థులకు సరైన భోజనం అందడం లేదు. రెండు రోజులుగా యూనివర్సిటీలో నిర్వాహకులు అల్పాహారం మధ్యాహ్న భోజనం విషయంలోనూ మెనూ అమలు చేయకపోవడం విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఉదయం విద్యార్థులకు అల్పాహారంలో ఇడ్లి అందించాల్సిన ఉన్నప్పటికీ పులిహోర పెట్టినట్లు విద్యార్థులు పేర్కొంటున్నారు. తొలి దశలోనే విద్యార్థుల మెనూ పై దృష్టి సారించకపోవడం విద్యార్థుల విద్యా ప్రగతి పై పెనుభారం మోపే అవకాశం ఉంటుందని విద్యార్థులు పేర్కొంటున్నారు. బాసర త్రిబుల్ ఐటీ యూనివర్సిటీ లో ఏడు వేల మంది విద్యార్థులకు గాను ఒక్కో విద్యార్థికి 95 రూపాయలు చొప్పున మెస్ యాజమాన్యాలు చెల్లించేలా టెండరు దాఖలు చేశారు. దీంతో ఇప్పటికైనా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు

Related posts

మతవాద  పార్టీ లను గ్రామాలకు రానివ్వొద్దు

Murali Krishna

10న జాతీయ నులిపురుగుల నిర్మూలనా దినోత్సవం

Satyam NEWS

వోటింగ్ టుమారో :ట్రంప్‌ అభిశంసనపై సెనెట్‌ లో విచారణ

Satyam NEWS

Leave a Comment