నిర్మల్ జిల్లా బాసర లోని శ్రీ జ్ఞాన సరస్వతీ దేవస్థానం లో ఈ రోజు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు మహా కలశ స్థాపన, దీక్ష సంకల్పంతో ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాలలో తదుపరి గణపతి పూజ, పుణ్య వాచనం, పంచ గవ్య ప్రాసన, ఘట స్థాపన పూజ జరిగాయి. ఆలయ స్దాన చార్యులు, ప్రధానార్చకులు, వేదపండితులు, పూజారులు ప్రారంభ ఘట స్థాపన పూజ చేశారు. ఈ పూజా కార్యక్రమములో ఆలయ eo, ఆలయ చైర్మన్ మిగతా సిబ్బంది పాల్గోన్నారు. ఈ రోజు అమ్మవారు మొదటి రోజు శైలపుత్రీ అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు
previous post
next post