రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశానుసారం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ఆర్జిత సేవలు బంద్ చేశారు. కరోనా ఎఫెక్ట్ తో అమ్మవారి ఆలయంలో నిత్యం జరిగే వివిధ ఆర్జిత సేవ పూజలను ఆలయ అధికారులు నిలిపి వేశారు.
అదే విధంగా తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ అక్షరాభ్యాసం, కుంకుమార్చన వివిధ అర్జిత సేవలు కూడా నిలిపివేయాలని దేవాదాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. కరోన వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని సరస్వతి అమ్మవారి భక్తులు సహకరించాలని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు.