శ్రావణ మాసం ఆదివారం కావడంతో బాటు శుభ ముహూర్తం ఉండటంతో నేడు నిర్మల్ జిల్లా బాసర, శ్రీ జ్ఞాన సరస్వతీ దేవీ అమ్మవారి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. ఈ రోజు ఉదయం నుంచి చిన్నారులకు అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాస మండపాలలో ఆలయ పూజారులచే అక్షరాభ్యాసము చేయిస్తూ అమ్మవారి అనుగ్రహము పొందుతున్నారు. వారి చిన్నారులకు మంచి బుద్దిని, మేధస్సును వారి చదువులలో మంచి జ్ఞానం ఇవ్వమని అమ్మవారిని ప్రార్థిస్తున్నారు. పుణ్యస్నానాలు చేయడంతో బాటు దానదర్మది కార్యక్రామాలు చేస్తున్నారు. దాంతో అమ్మ వారి దేవస్థానం నేడు భక్తులతో కళకళలాడింది.
