36.2 C
Hyderabad
April 25, 2024 22: 38 PM
Slider సంపాదకీయం

బివేర్ ఆఫ్ బాట్: హైదరాబాద్ నడి బొడ్డున గబ్బిలాల దిబ్బ

bats and pegions

కరోనా వైరస్ తెలంగాణలో ఏ ఒక్కరికి సోకలేదు. ఇటలీ నుంచి వచ్చిన మహిళ విషయంలో కూడా క్లారిటీ వచ్చేస్తే ఇక కరోనా వైరస్ గురించి స్థానికంగా ఎలాంటి ఆందోళనా చెందాల్సిన అవసరం ఉండదు. అయితే హైదరాబాద్ మెడపై ఒక కత్తి వేలాడుతూనే ఉంది.

కరోనా వైరస్ తో బాటు ఎబోలా వైరస్, సార్స్ లాంటి రుగ్మతలకు కారణమైన వైరస్ లను కడుపులో దాచుకుని సంచరించే గబ్బిలాల బెడద హైదరాబాద్ కు ఎక్కువగా ఉంది. గబ్బిలాలతో బాటు ఇలాంటి వైరస్ లు కాకపోయినా మానవులకు శ్వాసకోస సంబంధిత  వివిధ రకాల వైరస్ లు, పంటలకు కొన్ని రకాల తెగుళ్లను వ్యాప్తి చేసే పావురాలకు హైదరాబాద్ లో కొదవ లేదు.

హైదరాబాద్ లో పావురాల సంఖ్య విపరీతంగా ఉంటున్నది. ఏ ఎత్తయిన భవనం పైన అయినా పావురాలు కాపురం పెడుతున్నాయి. పావురాల వల్ల శ్వాసకోశ వ్యాధులు వస్తున్నట్లు అనేక ఫిర్యాదులు అందుతున్నా వాటి నిరోధానికి చేయగలిగింది ఏమీ లేదు. పావురాలను పెంచేందుకు కూడా చాలా మంది ప్రయత్నిస్తున్నారు. చాలా చోట్ల పావురాలకు జొన్నలు వేయడం కూడా మనం చూస్తుంటాం.

అదే విధంగా హైదరాబాద్ నగరం నడి బొడ్డున గబ్బిలాల సంఖ్య పెరిగిపోతున్న విషయం కూడా ఆందోళన కలిగిస్తున్నది. హైదరాబాద్ మధ్యన ఉన్న ఎన్టీఆర్ గార్డెన్స్ లో గబ్బిలాలు లెక్కు మించి ఉన్నాయి. ఎన్టీఆర్ గార్డెన్స్ అక్కడ ఏర్పాటు చేయకముందు అక్కడ ఒక పెద్ద కొండ ఉండేది. ఆ కొండపై గబ్బిలాలకు ఆవాసం ఉండేది.

అక్కడున్న పర్యావరణాన్ని కదిపేసే సరికి గబ్బిలాలు ఎక్కడకు వెళ్లాలో తెలియక అక్కడే వచ్చిన ఎన్టీఆర్ గార్డెన్స్ లో తిష్టవేశాయి. ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తున్న నేపథ్యంలో ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకురావడం అవసరమే. అందుకే దీనిపై సత్యం న్యూస్ ఫోకస్ పెట్టింది.

సాధారణంగా గబ్బిలాలు రాత్రి వేళల్లో సంచరిస్తుంటాయి. అయితే ఎన్టీఆర్ గార్డెన్స్ లో పట్టపగలే గబ్బిలాలు పుట్టలుపుట్టలుగా ఉంటున్నాయి. గబ్బిలాలను అక్కడ నుంచి తరలించడం సాధ్యం కాదు. గబ్బిలాల ఆవాసాలను గుర్తించి అక్కడ గబ్బిలాల శాంక్చురీ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

అందులోకి ప్రవేశించే వారికి అన్ని రకాల జాగ్రత్తలు చెప్పి అవసరమైన మాస్క్ లు ఇచ్చి ప్రవేశం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. గబ్బిలాలు ఉన్నాయి కదా అని అక్కడ పర్యావరణాన్ని విధ్వంసం చేయవద్దు.

Related posts

పేదలకు కార్పొరేట్ వైద్యం అందించడమే లక్ష్యం

Satyam NEWS

వి ఎస్ యూ లో గ్రామ మహిళ సంరక్షణ కార్యదర్శులకు శిక్షణ

Satyam NEWS

ఖమ్మం జిల్లాలో పోటెత్తుతున్న వరద నీరు

Satyam NEWS

Leave a Comment