36.2 C
Hyderabad
April 24, 2024 20: 03 PM
Slider ప్రత్యేకం

ఆస్ట్రేలియన్ పార్లమెంట్ హౌస్ లో తొలిసారి బతుకమ్మ వేడుక

#batukammaataustrelia

కెన్ బెరా లోని ఆస్ట్రేలియన్ పార్లమెంట్ హౌస్ లో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆస్ట్రేలియాలోని తెలంగాణ ప్రజలు మొత్తం ఈ వేడుకలలో పాల్గొంటున్నారు. ఆస్ట్రేలియా పార్లమెంట్ హౌస్ లో తొలి సారిగా బతుకమ్మ పండుగ వేడుకలు జరుగుతున్నాయి.

అత్యంత వైభవంగా జరుగుతున్న బతుకమ్మ పండుగ వేడుకల్లో ఫెడరల్ ఫైనాన్స్ మంత్రి కాటె గల్లాఘర్ పాల్గొన్నారు. ముఖ్యఅతిధిగా పాల్గొన్న మంత్రి తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ వేడుకలను తిలకించారు. ఈ మొత్తం కార్యక్రమంలో ఆస్ట్రేలియాలోని దాదాపు 800 మంది తెలంగాణ ప్రజలు పాల్గొనడంతో ఆ ప్రాంతం అంతా సందడిగా మారింది. ఆటపాటలతో, సంగీతంతో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి.

రంగురంగుల విద్యుత్ దీపాలను అలంకరించడంతో ఆ ప్రాంతం మొత్తం పండుగ వాతావరణ నెలకొన్నది. ఈ కాకయక్రమాన్ని ACT Telangana Association నిర్వహించగా అధ్యక్షుడు రమేష్ క్యాల అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియన్ కాపిటల్ టెరిటరీ అటార్నీ జనరల్ షేన్ రొట్టెన్ బ్రూ, ACT లిబరల్స్ లీడర్ ఎలిజిబెత్ లీ, ఎంఎల్ఏ సుజాన్నే ఆర్ర్ కూడా పాల్గొన్నారు.

ఫెడరేషన్ ఆప్ ఇండియన్ అసోసియేషన్స్ అధ్యక్షురాలు శాంతి రెడ్డి బతుకమ్మ పండుగ విశిష్టతను తెలియచేశారు. తెలంగాణ ప్రాంతంలో అత్యంత వైభవంగా ప్రజలంతా కలిసి కట్టుగా జరుపుకునే బతుకమ్మ పండుగ నేపథ్యాన్ని వివరించారు. ఆస్ట్రేలియా లోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన వారంతా ఈ పండుగలో పాల్గొనడం ఆనందం కలిగించిందని ఆమె తెలిపారు.    

Related posts

ఉచిత వ్యాక్సిన్ పై జగన్ యూటర్న్ తీసుకోవడంలో ఆంతర్యమేమిటి?

Satyam NEWS

అడ్డగుట్టలో గోడ కూలి ముగ్గురి మృతి

Bhavani

పేదరికం నుండి బయట పడాలంటే చదువు ఒక్కటే మార్గం

Satyam NEWS

Leave a Comment