37.2 C
Hyderabad
April 19, 2024 13: 00 PM
Slider ఆదిలాబాద్

సోన్ మండలంలో బతుకమ్మ చీరల పంపిణీ

#sarees

నిర్మల్ జిల్లా సొన్ మండలంలో శనివారంనాడు మంత్రి అల్లోల  ఇంద్రకరణ్ రెడ్డి బతుకమ్మ  చీరలు పంపిణీ చేశారు. మున్నూరు కాపు  సంఘం ఫంక్షన్ హాల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో  కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్  చెక్కులను కూడా ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సొన్  మండలం నకు సంబంధించి 11వేల 136  చీరలు పంపిణీ చేయనున్నామని,  సోమవారం నుండి అన్ని రేషన్ షాపు లలో పంపిణీ కార్యక్రమం ఉంటుందని తెలిపారు.

మండలం లో మొత్తం 11 వేల 136 మందికి బతుకమ్మ చీరలు పంపిణి చేస్తున్నట్లు తెలిపారు. నూతన  మండలం ఏర్పడ్డాక  సొన్ మండలం అభివృద్ధి పథం లో ముందుకు వెళుతుందని  అన్నారు. కళ్యాణ లక్ష్మీ – షాది ముబారక్ పథకాలతో వారికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉందన్నారు.  మండలానికి చెందిన 33 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు మంత్రి పంపిణీ చేశారు. తదనంతరం మహిళలు బతుకమ్మ ను పేర్చి బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమం లో జడ్పి  ఛైర్పర్సన్ విజయలక్ష్మి,    రాంకిషన్, ఆర్ డి వో తుకారామ్, ఎంఆర్ఓ హిమబిందు, ప్రజా  ప్రతినిధులు,  అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

నారా బ్రాహ్మిణిపై అసభ్యపోస్టులు పెట్టిన వ్యక్తికి దేహశుద్ధి

Satyam NEWS

రాజధాని తరలింపుపై హైకోర్టులో పిటిషన్ దాఖలు

Satyam NEWS

అందరూ కలిసిమెలిసి ఉండేందుకే లోక్ అదాలత్ కార్యక్రమం

Satyam NEWS

Leave a Comment