27.7 C
Hyderabad
March 29, 2024 02: 55 AM
Slider రంగారెడ్డి

తెలంగాణ ఆడబిడ్డలకు దసరా పండుగ కానుకగా బతుకమ్మ చీరలు

#batukammasarees

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఆడబిడ్డలకు దసరా పండుగ కానుకగా బతుకమ్మచీరలను పంపిణీ చేస్తోందని మల్లాపూర్‌ కార్పోరేటర్‌ పన్నాల దేవేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఉప్పల్ నియోజకవర్గంలోని మల్లాపూర్‌లోని నెహ్రూనగర్‌ కమ్యూనిటిహాల్‌ , అశోక్‌నగర్‌ మండల పరిషత్‌ స్కూల్‌లో స్థానిక కార్పోరేటర్‌ పన్నాల దేవేందర్‌రెడ్డి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణలో చాలా పెద్ద పండగ అని, ప్రతి ఆడపడుచు కొత్త బట్టలు కట్టుకోని సంతోషంగా ఉండాలనే  ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ బతుకమ్మ చీరలు పంచడం జరుగుతోందని అన్నారు. బతుకమ్మ చీరలు అందరూ తీసుకోవాలని, బతుకమ్మ పండగను సంతోషంగా జరుపుకోవాలని పన్నాల కోరారు.

 పమాదాల నివారణకు మల్లాపూర్‌ చౌరస్తాలో మరొక వంతెన నిర్మించాలి

మల్లాపూర్‌ ఎక్స్‌రోడ్డు (కరిరాజుల చౌరస్తా) లో ట్రాఫిక్‌ క్రమబద్దీకరించడానికి సంబంధిత అధికారులతో చర్చించి విభాగినులను ఏర్పాటు చేయించానని కార్పోరేటర్‌ అన్నారు. ఈ సందర్బంగా  అక్రమ పార్కింగ్‌ చేస్తున్న వాహనాలను ఎస్‌ఐ పుల్లారెడ్డి  సిబ్బంది సహకారంతో క్లియర్‌ చేయించారు. అనంతరం దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రమాదాల నివారణకు, ట్రాఫిక్‌ కష్టాలు తొలగించుటకు మల్లాపూర్‌ చౌరస్తాలో మరొక వంతెన నిర్మించాలని కోరారు. కార్యక్రమంలో డివిజన్‌ ప్రెసిడెంట్‌ కిరణ్‌కుమార్‌రెడ్డి, వాసుగౌడ్‌, ఎన్‌ రవికుమార్‌గౌడ్‌, రవిచారి, చద్రశేఖర్‌ , దుర్గయ్య, ప్రవీణ్‌, రఘు , నరేందర్‌రెడ్డి , మల్లేష్‌, దత్తు వీరస్వామి స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

జియోటెక్నికల్, స్ట్రక్చరల్  ఇంజనీరింగ్‌లో పురోగతిపై కార్యశాల

Satyam NEWS

మంచోళ్లను ముందు పెట్టి పెద్దోళ్లు దోచుకుతింటున్నారు

Satyam NEWS

‘గతం’ మూవీకి అరుదైన అవకాశం

Sub Editor

Leave a Comment