39.2 C
Hyderabad
March 29, 2024 17: 01 PM
Slider ఆంధ్రప్రదేశ్

బంగాళాఖాతంలో మ‌రో వాయుగుండం

Kanna-Babu Weather

ఆగ్నేయ బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్నవాయుగుండం రాగల 24గంటల్లో బ‌ల‌ప‌డి వాయుగుండంగా మార‌నున్న‌ట్లు విప‌త్తుల శాఖ క‌మిష‌న‌ర్ కె. క‌న్న‌బాబు తెలిపారు. బుధవారం సాయంత్రం శ్రీలంక దగ్గర ఈ వాయుగుండం తీరం దాటే అవకాశం ఉంద‌ని దీని ప్రభావంతో బుధవారం, గురువారం దక్షిణకోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉంద‌న్నారు.

దీని ప్ర‌భావంతో ఆగ్నేయ బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో సముద్రం అల్ల‌క‌ల్లోలంగా ఉంటుంద‌ని మంగ‌ళ‌వారం రాత్రి నుంచి మత్స్యకారులు వేటకు వెళ్ళరాద‌న్నారు. ఇక ఇప్ప‌టికే వేటకు వెళ్ళిన మత్స్యకారులు వెంటనే తిరిగి రావాల‌ని, వారికి కూడా ఈ స‌మాచారాన్ని చేర‌వేయాల‌ని పేర్కొన్నారు. మ‌రోవైపు ప్రజలు, రైతులు కూడా అప్రమత్తంగా ఉండాల‌ని క‌న్న‌బాబు సూచించారు.

Related posts

చరిత్రలో తొలి సారి వైఎస్ఆర్ కాంగ్రెస్ సాధించిన ఘనత ఏమిటంటే…

Satyam NEWS

భారత్ అమెరికన్ క్రియేషన్స్ బహుభాషా చిత్రం “భారతీయన్స్”

Satyam NEWS

నెట్‌అకాడ్ రైడర్స్‌ ఇండియా ఛాంపియన్‌గా భాషిత 

Satyam NEWS

Leave a Comment