27.7 C
Hyderabad
April 18, 2024 08: 00 AM
Slider ఆదిలాబాద్

రేపు బీసీ సంఘం కార్యవర్గ ప్రమాణ స్వీకరమహోత్సవం

#bcassociation

ఇటీవల నూతనంగా ఎన్నికైన బీసీ సంక్షేమ సంఘం కార్యవర్గ ప్రమాణ స్వీకర మహోత్సవం కార్యక్రమాన్ని ఆదివారం జిల్లా కేంద్రంలోని టీఎన్‌జీవో భవనంలో నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిక్కాల దత్తు, కలాల శ్రీనివాస్‌లు అన్నారు. శుక్రవారం జిల్లా బీసీ సంక్షేమ సంఘ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ప్రమాణ స్వీకర మహోత్సవ కార్యక్రమానికి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ రాథోడ్‌ జనార్ధన్, ఎంపీ సోయం బాపురావ్, ఆదిలాబాద్, బోథ్, ఖానాపూర్‌ ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్‌ బాపురావ్, రేఖానాయక్, డీసీసీబీ చైర్మన్‌ అడ్డి భోజారెడ్డి, గ్రంథాలయ చైర్మన్‌ రాహుత్‌ మనోహర్, మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌లతో పాటు కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు సాజిద్‌ ఖాన్, ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్‌ సుజాత, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్‌ శంకర్, సుహాసిని రెడ్డి, కంది శ్రీనివాస రెడ్డి, వైఎస్సార్‌ పార్టీ నాయకుడు అనిల్‌ కుమార్, డాక్టర్‌ రవికిరణ్‌ యాదవ్‌లు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారన్నారు. జిల్లాలోని బీసీ కార్యవర్గ సభ్యులు, కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

బీసీ అనుబంధ సంఘాల అడహక్‌ కమిటీ నియమాకం

బీసీ సంక్షేమ సంఘం అనుబంధ సంఘాల అడహక్‌ కమిటీ కన్వీనర్, కో కన్వీనర్‌లను నియమించిన్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిక్కాల దత్తు, కలాల శ్రీనివాస్‌లు తెలిపారు. మహిళ విభాగం కన్వీనర్‌గా బియ్యాల అనుసూయ, ఉమామహేశ్వరి, కన్నాల లక్ష్మీ, కో కన్వీనర్‌గా నియమించడం జరిగిందన్నారు. ఉద్యోగ సంఘం కన్వీనర్‌గా జక్కుల శ్రీనివాస్, కో కన్వీనర్‌గా నర్ర నవీన్‌ యాదవ్‌లు, యువజన విభాగం కన్వీనర్‌గా తోకల నరేష్, కో కన్వీనర్‌లుగా లంక కార్తీక్, ప్రఫుల్‌ యాదవ్, టి రమణ, రవీందర్, సోమగారి అఖిల్, కార్తీక్, శివకుమార్, సురేందర్, విద్యాసాగర్‌లు ఉన్నారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం కోశాధికారి అంజయ్‌ కుమార్, ఉపాధ్యక్షులు మ్యాకల అశోక్, కన్వీనర్‌ మంచికట్ల ఆశమ్మ, ముఖ్య సలహాదారులు మోహన్‌ బాబు, కేమ రాజారెడ్డి, జాయింట్‌ సెక్రెటరీ యువరాజ్, నర్ర నవీన్‌ యాదవ్, ప్రచార కార్యదర్శి దాముక రవీందర్, భాష్యం నర్సీంగ్, తదితరులు ఉన్నారు.

Related posts

మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో కేర్ ఆఫ్ కంచెరపాలెం నిర్మాత ప్రవీణ

Satyam NEWS

మాస్క్ లేకుంటే విద్యార్ధుల్ని కాలేజీకి రానివ్వద్దు

Satyam NEWS

ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై దృష్టి సారించిన సోనియాగాంధీ

Satyam NEWS

Leave a Comment