26.1 C
Hyderabad
May 15, 2021 05: 16 AM
Slider హైదరాబాద్

మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు సంఘీభావంగా బీసీ ల దీక్ష

#BCUnity

బీసీ వర్గానికి చెందిన ఈటల రాజేందర్ ను మంత్రి వర్గం నుండి బర్తరఫ్ చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం హైదరాబాద్ ముషీరాబాద్ దోమల్ గూడ లోని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ నిరసన దీక్ష చేపట్టారు.

ఈ సందర్భంగా జాజుల మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా కార్యాలయాల్లో బీసీ నిరసన దీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈటల రాజేందర్ కు యావత్తు బీసీ సమాజం అండగా ఉంటుందని తెలిపారు.టీఆరెఎస్ పార్టీ లో ఉన్న అవినీతి మంత్రులు, ఎమ్మెల్యే ల పై చర్యలు తీసుకోకుండా కేవలం బీసీ వర్గానికి చెందిన ఈటల మీద కక్ష కట్టి చర్య ఎందుకు తీసుకున్నారో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు.

టీఆర్ఎస్ పార్టీ లో ఉన్న బీసీ సామాజికవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు అందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ పార్టీ బీసీ వ్యతిరేక పార్టీగా వ్యవరిస్తుందని మండిపడ్డారు.

Related posts

శ్రీవిష్ణు హీరోగా నిర్మిస్తున్న చిత్రం రాజ రాజ చోర

Satyam NEWS

తల్లితో బాటే అనంత లోకాలకు తరలిన కొడుకు

Satyam NEWS

ఎల్ బి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్ కలకలం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!