24.7 C
Hyderabad
March 29, 2024 08: 10 AM
Slider వరంగల్

జాగ్రతలు తీసుకోండి సైబర్ నేరస్తుల బారిన పడకండి

#MahaboobabadPolice

సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండేందుకు జాగ్రత్తలు పాటించాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి కోరారు.

జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 35 సైబర్ నేరాలు 25 ఇతర కంప్లైంట్స్ మొత్తం 60 కేసులు నమోదు అయ్యాయని ఎస్పీ అన్నారు.

ఇందులో చాలా నేరాలు కర్ణాటక, బీహార్, ఒరిస్సా, పంజాబ్ నుండి జరుగుతున్నట్లు గుర్తించామని తెలిపారు. ఇలాంటి సైబర్ నేరగాళ్ల నుండి ప్రజలను కాపాడేందుకు 24/7 టీం పని చేస్తూనే ఉంటుందని ఎస్పీ పేర్కొన్నారు. త్వ

రలోనే ప్రజలకు ఆహాగాహన కలిగే విధంగా ప్రచారాలు,కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు.

ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు ఫేక్ ఫేస్ బుక్,ట్విట్టర్,ఇన్స్టాగ్రామ్ మొదలగు సోషల్ యాప్స్ పైన తమ బుద్దిని చూపిస్తూ అమాయకమైన ప్రజలను మోసం చేసి డబ్బులు లాగుతున్నారని దృష్టికి వచ్చిందని ఎస్పీ అన్నారు.

ముఖ్యంగా పోలీస్ అధికారులు ఫోటోలు, పేర్లు వాడుకొని కొంత డబ్బు కావాలని పర్సనల్ నెంబర్ కు ఫోన్ పే ,లేదా గూగుల్ పే చేయమని అడిగి కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని అన్నారు.

ఇలాంటి మోసాలకు తెరదించాలంటే కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటిస్తే 99% ఇలాంటి మోసాలు అరికట్టవచ్చు అని ఎస్పీ అన్నారు.

 ఈ సందర్భంగా సోషల్ యాప్స్ ఉపయోగించే ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు జాగ్రత్తలు పాటించాలని ఆయన కోరారు.

Related posts

ప్రేమలు అనేకం అనేదే “లాట్స్ ఆఫ్ లవ్”

Satyam NEWS

ఖమ్మం లో రూ.36 కోట్లతో ఐటి హబ్ రెండో దశ

Satyam NEWS

శ్రీ కుమరన్ తంగమాలిగై చెన్నై సిల్క్స్ లో ఘనంగా శ్రీనివాస కళ్యాణం

Satyam NEWS

Leave a Comment