29.2 C
Hyderabad
October 10, 2024 19: 34 PM
Slider ఆంధ్రప్రదేశ్

24 గంటలూ అలర్ట్‌గా ఉండండి

isro

దేశంలోని కోస్తా తీర ప్రాంతాలకు ఇంకా ఉగ్రవాద ముప్పు వదల్లేదు. సముద్రమార్గం ద్వారా దేశంలోకి ప్రవేశించినట్లు అనుమానిస్తున్న ఉగ్రవాదుల ఆచూకీ ఇంకా తెలియలేదు. దాంతో ఇంకా హై ఎలర్ట్ కొనసాగిస్తూనే ఉన్నారు. సముద్రం తీరం వైపు దృష్టి సారించి ఉంచాలని కోస్ట్ గార్డ్‌లకు నిఘా వర్గాలు తాజాగా హెచ్చరికలు పంపింది. సముద్ర మార్గంలో దక్షిణాది రాష్ట్రాల్లో ప్రవేశించేందుకు ఉగ్రవాదులు కుట్రలు పన్నుతున్నారని నిఘా వర్గాలకు సమాచారం అందింది. దాంతో తీర ప్రాంతాల్లో హైఅలర్ట్ కొనసాగుతోంది. ఐతే తాజాగా తెలిసిందేంటంటే నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం – శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)పై దాడి చేసేందుకు ఉగ్రవాదులు రెడీ అయ్యారని తెలిసింది. దాంతో అక్కడ హై అలర్ట్ ప్రకటింటారు. ప్రస్తుతం షార్ పూర్తిగా భద్రతాబలగాల రక్షణలో ఉంది. అలాగే బంగాళాఖాతంలో 50 నాటికల్ మైళ్ళ వరకూ CISF, మెరైన్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. తీరంలో పడవలపై నిఘా పెట్టారు. వారం నుంచీ తీర ప్రాంతాల్లో గస్తీ బాగా పెంచారు. ఇటీవలే చంద్రయాన్ ప్రయోగం చేసిన షార్‌కి ఇస్రో నుంచీ తరచూ శాస్త్రవేత్తలు వచ్చి వెళ్తున్నారు. శ్రీహరికోటను నాశనం చేస్తే ఇస్రోకి గట్టి దెబ్బ తగులుతుందనీ, అది ఇండియాకి తీరని లోటు అవుతుందని ఉగ్రవాదులు భావిస్తున్నట్లు తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లో వాళ్లకు ఛాన్స్ ఇవ్వకూడదన్న ఉద్దేశంతో శ్రీహరికోట మొదటి, రెండో గేటు దగ్గర ప్రతి వాహనాన్ని బాగా చెక్ చేసి పంపిస్తున్నారు. శ్రీహరి కోట పూర్తిగా అడవుల్లో ఉంటుంది. ఉగ్రవాదులు చొరబడేందుకు వీలుగా ఉంటుంది.

Related posts

ఫైర్ బ్రాండ్ మంచు లక్ష్మీ ‘ఆది పర్వం’ ప్రచార చిత్రానికి అసాధారణ స్పందన

Satyam NEWS

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో బోధనేతర సిబ్బందికి శిక్షణా తరగతులు

Satyam NEWS

నేరాల నియంత్రణ లో యువత భాగస్వామ్యం కీలకం

Satyam NEWS

Leave a Comment