30.3 C
Hyderabad
April 16, 2021 13: 29 PM
Slider ప్రత్యేకం

Be alert: చంపేసేంత తీవ్రతతో వస్తున్న సూరిబాబు

#DayTemparature

ఎండ వేళ బయటకు వెళుతున్నారా? మనకేం కాదులే అనే అజాగ్రత్త వద్దు. ఎందుకంటే ఈ సారి ఎండల తీవ్రత మరీ ఎక్కువగా ఉండబోతున్నది.

సాధారణంగా మార్చిలో వేసవి సీజన్ ఆరంభ అవుతుంది. మార్చి నెల రెండో వారంలోనో.. లేక మూడో వారంలోనో ఎండ తీవ్రత పెరుగుతుంటుంది. ఏప్రిల్-మే వరకూ కొనసాగుతుంటుంది. నైరుతి రుతు పవనాల ఆగమనం వరకూ ఇదే తరహా వాతావరణం నెలకొని ఉంటుంది. రుతు పవనాల రాక జాప్యం అయ్యే కొద్దీ ఎండ తీవ్రత మరి కొంతకాలం పాటు ఉంటుంది. ఇది ఏటేటా జరిగే ప్రక్రియ. ఈ సారి మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితులు దేశంలో నెలకొన్నాయి. మార్చిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

121 సంవత్సరాల తరువాత మార్చిలో ఈ స్థాయిలో ఉష్ణోగ్రత నమోదు కావడం ఇది మూడోసారిగా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మార్చినెలలో రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రత రికార్డయిందని, ఈ 121 ఏళ్ల కాలంలో ఇది మూడోసారి మాత్రమేనని చెబుతున్నారు.

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. ప్రతి సంవత్సరం మార్చి నెలలో రికార్డయ్యే సగటు ఉష్ణోగ్రత 25.06 డిగ్రీల వరకు ఉంటుంది. అదే సమయంలో గరిష్ఠంగా 31.24, కనిష్ఠంగా 18.87 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదవుతుంటుంది. ఈ సీజన్‌లో మాత్రం దీనికి భిన్నమైన వాతావరణం కనిపించిందని, వేసవి కాలం ఆరంభంలోనే రికార్డు స్థాయిలో టెంపరేచర్ రికార్డయిందని అధికారులు చెబుతున్నారు.

గరిష్ఠంగా 32.65, కనిష్ఠంగా 19.95 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రత నమోదైందని, మార్చి నెల మొత్తంగా 26.30 డిగ్రీల టెంపరేచర్ రికార్డయిందని వెల్లడించారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో మార్చి నెలలో 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రత నమోదు కావడం అసాధారణ విషయమని చెప్పారు.

ఇదే తీవ్రత ఏప్రిల్-మే నెలల్లోనూ కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఒడిశా, తెలంగాణ ఉత్తర ప్రాంత జిల్లాలు, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ లలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి.

Related posts

శాడ్: పోలీసులు తరిమి తరిమి చంపేశారు

Satyam NEWS

కోడెల కొట్టేసిన ఫర్నీచర్ జాబితా ఇది

Satyam NEWS

వైకుంఠ ధామ పనులను పరిశీలించిన ఎంపీడీవో

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!