38.2 C
Hyderabad
April 25, 2024 13: 12 PM
Slider ప్రత్యేకం

కేర్ ఫుల్: పతంగులు ఎగరవేస్తున్నారా జాగ్రత్త!

kites festival

పతంగులు ఎగురవేసేటప్పుడు విద్యుత్ స్తంభాలు ట్రాన్స్ ఫార్మర్స్ వంటి ప్రమాదకర వస్తువుల నుంచి జాగ్రత్తగా ఉండాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ సీఎండీ జి రఘుమా రెడ్డి కోరారు. పండగను ఆనందకరం చేసుకోవాలని కోరుతూ, కింది జాగ్రత్తలు పాటించాలని ఆయన కోరారు.

1) విద్యుత్ స్తంభాలపై ఉన్న తెగిన మాంజాలు, పతంగులు తీయటం కోసం పిల్లలు, యువకులు ఎవరైనా సరే స్థంబాలు ఎక్కటం కానీ, వాటికున్న దారం పట్టి లాగటం కానీ చేయరాదు. ఇలా చేయటం వలన విద్యుత్ సరఫరా జరుగుతున్న తీగలు రెండు ఒక దానికొకటి అంటుకొని షార్ట్ సర్క్యూట్ జరుగుతుంది. అందువల్ల షాక్ కు గురికావటంతో పాటు ఆ  విద్యుత్ లైన్ కి అనుసంధానించి వున్న గృహాలు/ వాణిజ్య సముదాయాల్లో గల టీవీ లు, ఫ్రిడ్జ్ లు, ఏ సి లు కాలిపోయే అవకాశం వుంది. దీని వలన ఆస్తి నష్టం తో పాటు ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది.

2) పతంగులు ఎగరవేయటం లో మెటాలిక్ దారాలు  ఎలాంటి పరిస్థితుల్లో ఉపయోగించొద్దు. మెటాలిక్ దారాల వల్ల పక్షులు ప్రాణాలు కోల్పోవటం తో పాటు, ఆ మెటాలిక్ దారాలు విద్యుత్ తీగలకు  తగిలి నప్పుడు షాక్ కొట్టే అవకాశం వున్నది. లైన్లు సైతం తెగే ప్రమాదం వున్నది.   

3) విద్యుత్ అధికార్లు, ఎక్కడైనా విద్యుత్ సరఫరా లో అంతరాయం ఏర్పడినప్పుడు దాని కారణం తెలుసుకుని మాత్రమే సరఫరా పునరుద్దరించాలి.

4) ఏదైనా ప్రాంతం లో విద్యుత్ తీగలపై పతంగులు, వాటి తీగలు పడ్డట్టు  తమకు తెలిస్తే 1912 కి సమాచారం ఇవ్వటం గానీ, లేదా సమీప విద్యుత్ కార్యాలయానికి తెలియచేయాలి. తమ సిబ్బంది వచ్చి ఆ తీగలపై పడ్డ మాంజాలను పతంగులను తొలగిస్తారు. ఇలా విద్యుత్ తీగలపై పడ్డ వాటిని వెంటనే తీయకుంటే విద్యుత్ సరఫరా లో అంతరాయం గానీ, షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశమున్నది.

Related posts

కోటప్పకొండలో ప్రజల్ని ఆకట్టుకున్న అవగాహన స్టాళ్లు

Satyam NEWS

రాజయోగం సినిమాతో రెండు గంటలు వినోదం గ్యారెంటీ

Bhavani

How to Buy XRP in 2023 With PayPal or Credit Card

Bhavani

Leave a Comment