28.7 C
Hyderabad
April 24, 2024 03: 10 AM
Slider ప్రత్యేకం

చింతపల్లి బీచ్ ఒడ్డున ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్…

“స్వచ్ఛత జన్ భాగీదారి” కార్యక్రమంలో

విజయనగరం జిల్లా కు ఈ మధ్య నే వచ్చి యంగ్ కలెక్టర్ నాగలక్ష్మి… ప్రభుత్వ కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయడంలో ముందుంటున్నారు.జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు తీసుకుని…రెండు నెలలు కాకుండా నే జిల్లా అధికారులను పరుగులు పెట్టించడమే కాక..తనూ వడివడిగా వేగవంతంగా పని చేస్తున్నారు.

కాగా భానుడు భగభగ మంటున్న ఈ వేసవి కాలంలోనే… అటు ప్రజలచేత ,ఇటు స్వచ్ఛంద సంస్థల చేత ప్రభుత్వ, సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ కోసం ప్రారంభించిన మిషన్ లైఫ్( లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్ మెంట్) ఉద్యమంలో భాగంగా స్వచ్ఛత జన్ భాగీదారీ పేరుతో సాగర తీర స్వచ్ఛత – బీచ్ క్లీనింగ్ కార్యక్రమాన్ని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పూసపాటి రేగ మండలం చింతపల్లి సముద్ర తీరంలో ప్రారంభించారు.

ముందు అందరిచే స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం… చింతపల్లి లో సముద్ర ఒడ్డున దాదాపు కిలో మీటర్ల వరకు… “శుభ్రత- పరిశుభ్రత” కార్యక్రమం…పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి సంయుక్తంగా నిర్వహించారు. సాగర తీర ప్రాంతాన్ని ప్లాస్టిక్ రహితంగా రూపొందించే లక్ష్యంతో ఫిషరీస్ శాఖ ఆధ్వర్యంలో..చింతపల్లి గ్రామస్థులు, చుట్టుపక్కల ప్రాంతాల్లో వున్న పరిశ్రమల ప్రతినిధులు, యువత, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొని…సముద్ర తీరాన్ని ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు.

ఎం.భారత్ కుమార్, సత్యం న్యూస్. నెట్, విజయనగరం

Related posts

అధికారి చేసిన పనితో సమగ్ర శిక్ష బోధకులకు అన్యాయం

Satyam NEWS

తాసిల్దార్ కార్యాలయంలో రైతు కుటుంబం ఆత్మహత్యాయత్నం

Satyam NEWS

సెప్టెంబర్ 2,3 తేదీలలో ఓటర్ నమోదు క్యాంపులు

Bhavani

Leave a Comment