చక్కటి కుటుంబం ఇంజినీరింగ్ చదువు మంచి ఉద్యోగం అన్ని వదిలివేసి బిక్షాటన చేస్తున్న ఓ యాచకుడి కథ ఇది.ఇదేదో బిచ్చగాడు అనే సినిమా గురించి చెబుతున్న కథ కాదు.నిజంగా జరిగిన సంఘటన ఇది.అయితే బిచ్చగాడు సినిమాలో ల ఆయన తన తల్లి ఆరోగ్యం కొసమో చేసిన దీక్ష కాదు.
పోలీసు అధికారిగా పనిచేసిన తండ్రి కొన్నేళ్ల క్రితం మరణించడం ,వెంటనే అమ్మకూడా చనిపోవడం, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు ఉన్నతస్థానాల్లో ఉన్నా ఎందుకో ఒంటరిననే భావంతో వచ్చిన మానసిక ఇబ్బందుల వల్లే ఇల్లూ, ఉద్యోగం వదిలేసి వెళ్లిపోయినట్లు చెప్పారు. దేశదిమ్మరిగా ఎటెటో తిరిగి తిరిగి సొంతూరికి వచ్చాననీ, కుటుంబసభ్యులెవరినీ కలుసుకోవాలని లేదని కేవలం ఆకలిని తీర్చుకోవడానికి యాత్రా స్థలాల్లో యాచిస్తున్నట్లు అయన తెలిపారు.
సుప్రసిద్ధ పూరీ జగన్నాధాలయం వద్ద ఓ యాచకుడికి ఓ రిక్షా కార్మికుడికి మధ్య జరిగిన బాహాబాహీ లో ఈ ఉదంతం బయటపడింది. వివరాల్లోకి వెళితే జగన్నాధాలయం వద్ద శుక్రవారం కాషాయవస్త్రధారి అయిన సాధువులా కనిపిస్తున్న బిచ్చగాడికి , రిక్షా కార్మికుడికి మధ్య జరిగిన గొడవ పది పోలీసు ఠాణాకు వెళ్లారు.గాయాలతో ఉన్న వారిద్దరిని పోలీసులు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స చేయించారు.
ఆ యాచకుడు లిఖిత పూర్వకంగా చేసిన పిర్యాదు అతని ని చూసి పోలీసు సిబ్బంది అనుమానం తో అతని గురించి ఆరా తీశారు.అతడిని ఒకప్పుడు మిల్టన్ కంపెనీలో ఇంజినీరుగా పనిచేసిన భువనేశ్వర్‌కు చెందిన గిరిజా శంకర్‌మిశ్రాగా గుర్తించారు.అతని కుటుంబ సబ్యులకు వివారాలు తెలుపుతామని చెప్పగా అయన అవసరం లేదని తానూ ఇలాగె ఉంటానని పోలీస్ లకు చెప్పడాం విశేషం