35.2 C
Hyderabad
April 20, 2024 17: 33 PM
Slider పశ్చిమగోదావరి

అధికారిక సమావేశాలకు ‘బినామీ’ ప్రజాప్రతినిధులు

#Benami

సాధారణంగా ఏవైనా ఎన్నికలలో పోటీచేసిన వ్యక్తులే ప్రజలచేత ప్రత్యక్షం గా ఎన్నుకోబడతారు. భార్య పోటీ చేస్తే భర్త కు ఓట్లు వేయరు. ఎన్నికలలో గెలిచిన ఎం ఎల్ ఏ లే శాసన సభ సమావేశాలకు హాజరౌతారు. భార్య ఎం ఎల్ ఏ గా గెలిస్తే ఆమె బదులు భర్త శాసన సభ సమావేశాలకు వెళ్ళడానికి అవకాశమే లేదు.

అదే విధంగా జిల్లా పరిషత్ కు సంబంధించి జరిగే జెడ్ పి టి సి ఎన్నికలలో గెలిసిన అభ్యర్థులే జెడ్ పి సమావేశాలకు హాజరౌతారు. మరి ఏలూరు జిల్లా పెదవేగి మండలం లో జరిగే మండల పరిషత్ సమావేశాలకు తల్లులు సర్పంచ్ లైతే తనయులు సమావేశాలకు ఏ హోదా లో హాజరౌతున్నారు.

భార్యలు సర్పంచ్ లైతే వారి స్థానం లో భర్తలు సమావేశాలలో ఎలా హాజరౌతారు. అలాగే ఎం పి టి సి లు గా భార్యలు ఎన్నికైతే భర్తలు సమావేశాలలో పాల్గొన వచ్చా? పదవొకరి దైతే పెత్తనం మరొకరిదా? అధికారులు కూడా ఒకరి స్థానం లో మరొకరు హాజరైతే పట్టించుకోరా?

రిజర్వేషన్ ల పరంగా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే దొకరైతే పరిపాలనా పరం గా అధికారం ద్వారా సంక్రమించే పెత్తనం దొడ్డి దారిలో బినామిగా ఇంకొకరు నిర్వహించ వచ్చా? పెదవేగి మండలం లో జరుగుతున్న మండల పరిషత్ సమావేశాలలో ఎన్నికల్లో గెలిచిన ప్రజా ప్రతినిధులకు బదులు వారి తరపున వారి బంధువులు పాల్గొంటున్న పరిస్థితి కొనసాగుతుందని పలువురు చర్చించుకుంటున్నారు.

Related posts

ఉత్తుత్తి పెట్టుబడులే తప్ప ఒరిగేది ఏమీ లేదు

Satyam NEWS

ఢిల్లీలో నేటి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్

Satyam NEWS

కొనసాగుతున్న అల్పపీడనంతో వర్ష సూచన

Satyam NEWS

Leave a Comment