37.2 C
Hyderabad
March 29, 2024 17: 46 PM
Slider విశాఖపట్నం

క‌లెక్ట‌ర్ కు రాష్ట్ర స్థాయిలో ఉత్త‌మ జిల్లా ఎన్నిక‌ల సంఘం అవార్డు

vinay chand

గ‌త ఏడాది కాలంగా ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌ను, స‌మర్ధ‌వంతంగా అమ‌లు చేస్తూ ప్రజలు, ప్రముఖుల ప్రశంసలు పొందుతున్నజిల్లా క‌లెక్ట‌ర్ వినయ్ చంద్ మ‌రో అవార్డుకు ఎంపిక‌య్యారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జాతీయ ఓటర్ల నినోత్సవం సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనపరచిన కలక్టర్లను ఆంధ్ర ప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ అధికారి ఎంపిక చేశారు. రాష్ట్రస్థాయిలో ఉత్త‌మ జిల్లా ఎన్నిక‌ల అధికారిగా అవార్డుకు ఎంపిక‌య్యారు.

రాజ్ భవన్ లో జనవరి 25వ తేదీన నిర్వహించే జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమంలో అవార్డును స్వీకరించడానికి ఆహ్వానించారు. ఈ మేర‌కు రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ సి.ఇ.ఓ. కార్యాల‌యం నుండి జిల్లా యంత్రాంగానికి స‌మాచారం అందింది. త‌న నాయ‌క‌త్వ ప్ర‌తిభ‌తో ఓట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణ కార్య‌క్ర‌మాన్నిస‌మ‌ర్ధ‌వంతంగా అమ‌లుచేసి ఓట‌ర్ల జాబితాలో స‌వ‌ర‌ణ‌ల‌కు సంబంధించిన వచ్చిన ద‌రఖాస్తుల‌న్నింటినీ ప‌రిష్క‌రించ‌డం, రాజ‌కీయ పార్టీల‌తో ఓట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణ కార్య‌క్ర‌మంపై ఎప్ప‌టిక‌ప్పుడు చ‌ర్చించి వారికి తెలియ‌జేసి వారి స‌హ‌కారంతో జిల్లాలో ఎన్నిక‌ల జాబితా స‌వ‌ర‌ణ‌లు ప‌క‌డ్బందీగా చేప‌ట్ట‌డం, ప్ర‌తి నెల క్ర‌మం త‌ప్ప‌కుండా ఇ.వి.ఎం.ల గోదాముల్ని త‌నిఖీచేసి ఓటింగ్ యంత్రాల భ‌ద్ర‌త‌ను ప‌ర్య‌వేక్షించ‌డం, బి.ఎల్‌.ఓ. నియామ‌కాలు చేప‌ట్టి ఓట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణ కార్య‌క్ర‌మాన్నిప‌క‌డ్బందీగా నిర్వ‌హించినందుకు ఎన్నిక‌ల సంఘం జిల్లా క‌లెక్ట‌ర్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేసింది.

Related posts

హైదరాబాద్లో భారీగా దొరికిన గంజాయి

Bhavani

హిందువులంతా సంఘటితం కావాలి

Bhavani

అసమర్థ టీఆర్ఎస్ పాలనవల్లే రైతులకు ఇన్ని ఇబ్బందులు

Satyam NEWS

Leave a Comment