28.7 C
Hyderabad
April 20, 2024 09: 59 AM
Slider మెదక్

ఉత్తమ ఉపాధ్యాయురాలి అత్యుత్తమ ప్రతిభ

#bestteacher

భావి భారతావనికి ఉత్తమ పౌరులను అందించే గురుతర బాధ్యత ఉపాధ్యాయులపై ఉందనేది కాదనలేని నిజం. ఉపాధ్యాయులు అంటే తప్పుచేస్తే దండించే తండ్రిలా.. అర్ధమయ్యేలా వివరించే తల్లిలా పాఠాలు బోధిస్తూ విద్యార్థులను ఉన్నత శిఖరాలు అధిరోహించేలా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా తనవంతు ప్రయత్నం చేస్తూ ఈ యేడాది జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నిలిచారు మియాపూర్ పాఠశాలలో పనిచేసే హిమబిందు. రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.

ఉన్నత చదువులతో పాటు ఉత్తమ విద్యా బోధన..

చదువుతోనే ఉన్నత శిఖరాలకు చేరవచ్చనే అమ్మానాన్నలు, గురువుల మాటలను తూచాతప్పక పాటిస్తూ కష్టపడి చదివి ఉన్నత విద్యాబ్యాసం పూర్తిచేసింది ఈ ఏటి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలు హిమబిందు. పాఠశాల స్థాయి నుండి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధిస్తూ అనుకున్న లక్ష్యం దిశగా అడుగులు వేసింది.

బీఎస్సీ, బీఎడ్, ఎంఏ ఇంగ్లీష్ చదివిన హిమబిందు ఎన్నోఅవకాశాలు ఉన్నా.. టీచింగ్ ఫీల్డ్ నే ఎంచుకున్నారు. 2008 బ్యాచ్ కు చెందిన ఆమెకు 2010లో రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం లక్ష్మారెడ్డి గూడలో మొదట పోస్టింగ్ లో జాయిన్ అయ్యారు. రెండున్నర సంవత్సరాలు అక్కడే చిన్నారులకు పాఠాలు బోధిస్తూ వచ్చారు. ఆ తర్వాత మియాపూర్ పాఠశాలకు మారారు.

ఇక్కడికి వచ్చాక హిమబిందు తన బోధనా పద్ధతులను పూర్తిగా మార్చుకున్నారు. తానే ఒక విద్యార్థిలా ఆలోచిస్తూ, వారికి అర్ధమయ్యే రీతిలో పాఠాలు చెప్పేందుకు ప్రయత్నించారు టీచరు హిమబిందు. అందులో విజయవంతం అయ్యారు. క్లాస్ రూంలోకి పాఠ్యపుస్తకాన్ని తీసుకువెళ్లి అందులోని పాఠాలను ఉన్నది ఉన్నట్టు చెప్పి పిల్లలకు అర్ధం అవకున్నా మన పని అయిపోయిందిలే అని కాకుండా పాఠ్యంశానికి అనుగుణంగా మెటీరియల్ తయారు చేసుకుని క్లాస్ రూంలోకి అడుగుపెడుతుంది ఈ ఉత్తమ టీచర్. దీంతో పిల్లలకు ఈజీగా పాఠాలు అర్ధమవడంతో అనతికాలంలోనే ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ వస్తున్నారు విద్యార్థులు. ఉపాధ్యాయురాలి కృషిని గుర్తించిన రోటరీ క్లబ్ 2017లో నేషన్ బిల్డర్ అవార్డును ప్రధానం చేసింది.

జాతీయ స్థాయిలో చిన్నారుల ప్రతిభ

ప్రభుత్వ బడుల్లో చదువులు అంటేనే వానాకాలం చదువులు అన్న అభిప్రాయాలను పటాపంచలు చేస్తూ సర్కార్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు రోబోటిక్స్ పై అవగాహన కల్పించారు. అలా ఢిల్లీ, బెంగళూరులో జరిగిన వరల్డ్ రోబోటిక్స్ ఒలంపియాడ్ లో దేశవ్యాప్తంగా అందులో పాల్గొన్న ఒకే ఒక ప్రభుత్వ పాఠశాల మియాపూర్. అలాగే

నేషనల్ ఉమెన్స్ సమీట్ లో మహిళ ఆరోగ్యం మీద జరిగిన పోటీల్లో హిమబిందు తర్ఫీదు ఇచ్చిన విద్యార్థులు జాతీయ స్థాయిలో రెండో బహుమతి సాధించారు. 2019లో రవీంద్ర భారతిలో జరిగిన బాలోత్సవ్ లో ఆయా విభాగాల్లో ప్రథమ, ద్వితీయ బహుమతులు సాధించారు. కృషి ఎన్జీఓ ఛైర్మెన్ మురహరి సహకారంతో పాఠశాలలో లైబ్రెరీ ఏర్పాటు చేయించారు.

జాతీయ స్థాయిలో గుర్తింపు..

ఉపాధ్యాయురాలు హిమబిందు ఎన్నో జాతీయ స్థాయి కార్యక్రమాల్లో పాల్గొని ఎందరో ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. బెంగళూరులో జరిగిన నేషనల్ కాన్ఫరెన్స్ వర్క్ షాప్ కు రాష్ట్రం నుండి అటెండ్ అయ్యారు. అలాగే కేరళలో జరిగిన ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ ఇంటరాక్షన్ ఫోరమ్ లో పాల్గొన్నారు. రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ సౌత్ ఇండియా ప్రోగ్రాం, బెంగళూరు క్రిస్ట్ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు యాక్షన్ రీసెర్చ్ ప్రోగ్రాంలు నిర్వహించి జాతీయ స్థాయిలో పలు ప్రదర్శనలు ఇచ్చారు. ఇటు రీసోర్స్ పర్సన్ గానూ వ్యవహరిస్తూ విద్యాబోధనపై ఎంతోమంది ఉపాధ్యాయులకు తర్ఫీదును ఇస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. అంతేకాదు పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ ఉత్తమ ఉపాధ్యాయురాలు హిమబిందు.

Related posts

జయాబచ్చన్, ఐశ్వర్యారాయ్ లకు కరోనా లేదు

Satyam NEWS

రికార్డులు మార్చేసి నా భూమి కొట్టేశారు! యువనేత ఎదుట ఓ బాధితుడి ఆవేదన

Bhavani

జగన్ రెడ్డి ప్రభుత్వంపై మెగాస్టార్ సంచలన వ్యాఖ్యలు

Satyam NEWS

Leave a Comment