27.7 C
Hyderabad
April 26, 2024 04: 05 AM
Slider ప్రత్యేకం

సైబ‌ర్ నేరాల ప‌ట్ల జ‌ర‌భ‌ద్రం: తెలియ‌ని వైబ్ సైట్ల ను ట‌చ్ చేయొద్దు…!

#cybercrime

స‌త్యం న్యూస్.నెట్  ఇంట‌ర్వ్యూలో సైబ‌ర్  స్టేష‌న్  ఎస్ఐ  ప్ర‌శాంత్ వెల్ల‌డి

తెలియ‌ని వెబ్ సైట్ల లింక్ ల‌ను ఓపెన్ చేయొద్ద‌ని…అలాగే ప్లే స్టోర్ లోడిజిట‌ల్ లోన్ యాప్ ల‌ను డౌన్ లోడ్ చేయొద్ద‌ని..చెబుతున్నారు… విజ‌య‌న‌గ‌రం జిల్లా సైబ‌ర్ క్రైమ్ స్టేష‌న్ అదికారి ఎస్ఐ  ప్రశాంత్..ఈ మ‌ధ్య చాలా మంది సెల్  ఫోన్ ల‌కు లోన్ క‌ట్టార‌ని…దాని ఈఎంఐ చెల్లించాంటూ ఓ నెంబ‌ర్ ఇస్తూ…ఓ మెసేజ్ ఫార్వ‌ర్డ్ అయ్యింది.

దీంతో చాలామందికి  అలాంటి మెసేజ్ లు  రావ‌డంతో కంగారుప‌డి…తెలియ‌క‌..తిక మడుతూ ఇబ్బందులు ప‌డుతున్నారు. ఆ విష‌యాన్ని గుర్తించిన మీడియా బృందం…అస‌లు  అలాంటి ఫ్రా్డ్ వాట్సాప్ మెసేజ్ ల‌పై ఎలాంటి చ‌ర్యల‌ను పోలీసులు తీసుకుంటున్నారు..? అస‌లు దీనికి వెనక ఉన్న క‌థేంటో అన్న‌దానిపై స‌త్యం న్యూస్.నెట్ ప్ర‌తినిధి నేరుగా విజ‌య‌న‌గ‌రం  స‌బ్ డీవిజ‌న్ అధికారిని  సంప్ర‌దించారు. 

దీంతో.. ఆరు నెలల క్రిత‌మే త‌మ స‌బ్ డివిజ‌న్ ప‌రిధిలో అదీ విజ‌య‌న‌ర‌గం డీఎస్పీ ఆవ‌ర‌ణ‌లో సైబ‌ర్ క్రైమ్ స్టేష‌న్ ను ఏర్పాటు చేసార‌ని తెలియ‌టంతో నేరుగా విజ‌య‌న‌గ‌రం డీఎస్పీని క‌లిసేందుకు య‌త్నించారు. అయితే డీఎస్పీ  ఊర్లో లేక‌పోవ‌డంతో… ఆయ‌న అనుమ‌తితో నేరుగా సైబ‌ర్ క్రైమ్ స్టేష‌న్  లో ఎస్ఐ ప్ర‌శాంత్ ను క‌లిసారు…స‌త్యం  న్యూస్.నెట్ ప్రతినిష‌ధి.  ఈ సంద‌ర్బఃంగా సైబ‌ర్ క్రైమ్ స్టేష‌న్ ఎస్ఐ ని స‌త్యం న్యూస్. నెట్  ఇంట‌ర్వ్యూ చేసింది. 

అస‌భ్య లింక్ లు…తెలియ‌ని యూఆర్ఎల్ ను ఓపెన్ చేయ‌డం వంటికి ఏ ఒక్క‌రూ పాల్ప‌డ‌వ‌ద్ద‌ని సైబ‌ర్ క్రైమ్ స్టేష‌న్ ఎస్ఐ  చెప్పారు.అలాగే ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో అదీ కొన్ని సెల్   ఫోన్ ల‌కు వ‌స్తున్న లోన్ స‌మాచారం ప‌ట్ల పై కూడా ఎస్ఐ ప్ర‌శాంత్ వివ‌ర‌ణ ఇచ్చారు. 

ఆర్బీఐ  నిబంద‌న‌లు క‌లిగిన బ్యాంకు లే…లోన్ లను మంజూరు చేస్తాయ‌ని… స్పాట్ లోన్ లు ఇస్తామ‌ని  నేరుగా ఇచ్చిన వారిని న‌మ్మొద్దన్నారు. అలాగ‌ని…డ‌బ్బు  అవ‌స‌రం కోస‌మని…ఏవీ తాక‌ట్టు పె్ట్టి  లోన్ లు తీసుకొవ‌ద్ద‌ని జాగ్రత్త‌లు చెప్పారు.

ఆధ‌రైజ్డ్. అలాగే ఆర్బీఐ ఉత్వర్వుల‌తోనే బ్యాంకులు రుణాలు ఇస్తామ‌ని అదీ బ్యాంకుకు వ‌చ్చి…షూరిటీ పాటు ముగ్గురు,నేలుగురి సంత‌కాలు తో ఇస్తుంద‌ని..తెలిపారు. తెలియ‌ని ఫోన్ నెంబ‌ర్ల నుంచీ మెసేజ్ లు వ‌చ్చి…లింక్ లు వ‌చ్చిన ఓపెన్ చేయొద్ద‌ని…వెంట‌నే సైబ‌ర్ క్రైమ్ స్టేస‌న్ కు పిర్యాదు చేయొచ్చ‌ని తెలిపారు.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం

Related posts

ఒక్క డీజీపీ త‌ప్ప మిగిలిన వారెవ్వ‌రూ మాస్క్ ధ‌రింలేదు..!

Satyam NEWS

శాంతిభ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగిస్తే పీడీ యాక్ట్‌

Sub Editor

విశ్లేషణ: ప్రధాని చెప్పేది విందాం అదే పాటిద్దాం

Satyam NEWS

Leave a Comment