సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూల్ రేంజ్ డీఐజీ కొయ్య ప్రవీణ్ కుమార్ అన్నారు. ఏ బ్యాంకు వారు కూడా ఓటిపిలు అడగరని ఆయన అన్నారు. తెలియని వ్యక్తులు ఎవరు అడిగినా కూడా చెప్పకూడదన్నారు. అదే విధంగా ఓటిపి ఎవ్వరికి షేర్ చేయకూడదన్నారు. తెలియని లింకులు క్లిక్ చేయకూడదన్నారు. డిజిటల్ అరెస్ట్ లు అనేవి ఏమి లేవన్నారు. అవన్నీ సైబర్ నేరగాళ్ళు చేసే మోసాలన్నారు. అన్ లైన్ లో పెట్టుబడులు పెడితే అధిక మొత్తంలో డబ్బులు రెట్టింపు అవుతాయనే సైబర్ నేరగాళ్ళ మాటలు నమ్మి ప్రజలు మోసపోకూడదన్నారు. నకిలీ లోన్ యాప్స్ లో రుణాలు తీసుకోకూడదన్నారు. సులభంగా లోన్ పొందవచ్చని సామాజిక మాధ్యమాల ద్వారా లింకులు పంపుతారు, ఫోన్లు చేస్తారన్నారు. బ్యాక్ గ్రౌండ్ వెరఫికేషన్ లేకుండా, ఎలాంటి ధ్రువపత్రాలు లేకుండానే లోన్ ఇస్తామంటే అనుమానించాలన్నారు. మీకు తక్కువ మొత్తం లోన్ ఇచ్చి, భారీ మొత్తం తిరిగి చెల్లించమంటారు. లేకపోతే, మీ గాలరీ లోని ఫోటోలు అశ్లీలంగా మార్ఫింగ్ చేసి, మీ ఫోన్ లోని బంధువులకూ, స్నేహితులకు పంపుతామని బెదిరిస్తారు. ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే బాధిత ప్రజలు వెంటనే డయల్ 1930 కి ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలన్నారు.
previous post