35.2 C
Hyderabad
April 20, 2024 18: 13 PM
Slider గుంటూరు

లోన్ అప్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి

#apdgp

ఇటీవల కాలంలో డిజిటల్ ప్లాట్ ఫారం ద్వారా లావాదేవీలు జరుపుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అదే విధంగా  డిజిటల్ ప్లాట్ ఫారం ద్వారా అనేక నేరాలు పెరుగుతున్నాయని ఆంధ్ర ప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కే.వి. రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. అక్రమ ఋణ అప్  రుణాలు/సూక్ష్మ క్రెడిట్లను అందజేయడం, ముఖ్యంగా బలహీనమైన తక్కువ ఆదాయ వర్గాలకు అధిక వడ్డీ రేట్లు మరియు ప్రాసెసింగ్/దాచిన చార్జీలతో లోన్లు ఇచ్చి బ్లాక్మెయిలింగ్, నేరపూరిత బెదిరింపులతో కూడిన దోపిడీ, రికవరీ పద్ధతులకు పాల్పడుతున్నారని తెలిపారు. అక్రమ ఋణ అప్  ద్వారా వేలల్లో అప్పు తీసుకొని లక్షల్లో దోచేస్తూ అప్పు ఎంత తీర్చిన సరిపెట్టుకోకుండా మరిన్ని ఋణ అప్  డౌన్లోడ్ చేయించి వారికి  చిన్న చిన్న అప్పులు ఇస్తూ మరింతగా  ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

ఋణ అప్ మీరు డౌన్లోడ్ చేసేటప్పుడు అజాగ్రత్రగా ఉంటే  మీ మొబైల్ ఫోన్ కాంటాక్ట్స్, కెమెరా లొకేషన్. ఎస్. మ్.ఎస్. స్టోరేజి ఇతర అనుమతులను అడిగి వ్యక్తిగత సమాచారంను మీకు తెలియకుండా తస్కరిస్తారు. మీ ఫ్యామిలి ఫొటోస్, కాల్ రికార్డింగ్స్ మార్ఫింగ్ చేసి అశ్లీల చిత్రాలుగా మార్చి మీ బంధువులకు, స్నేహితులకు సామాజిక మాధ్యమాలలో పంపి మిమ్మల్ని ఇబంధులకు గురి చేస్తారు.

ఋణ గ్రహితలనే కాకుండా వారి కుటుంబ సభ్యులను మరియు సన్నిహితులను డిఫాల్టర్గా ప్రకటించి, బ్లాక్మెయిల్ చేస్తూ అక్రమంగా అధిక వడ్డీలు వసూలు చేయుచున్నారు. అంతే కాకుండా వారిపై  మానసికంగా మరియు శారీరకంగా వేధింపులకు గురిచేస్తున్నారు. లోన్ అప్ ద్వారా ఋణాలు తీసుకునేటప్పుడు  అప్రమత్తంగా ఉండాలని, యాప్ డౌన్లోడ్ చేసేటప్పుడు ఈ అనుమతులను ఇవ్వద్దని DGP కోరారు.

నకిలీ ఋణ యాప్స్ సంస్థలు ఎటువంటి హామీ పత్రాలు మరియు CIBIL స్కోర్ లేకుండా వెంటనే ఋణం మంజూరు చేస్తాం అని ఎర వేస్తారు మొత్తం ఋణం తీర్చిన తరువాత కూడా ఇంకా కట్టాలని వేధిస్తారు. వీటిపట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

ఉదాహరణకు: i) In Cash 2) Cash ern 3). Cash lion 4) Maatermelon 5)Lucky wallet 6) Coco cash 7) Rupee Plus 8) Indian Loan 9) Credit finch 10) Tap credit 11) Ratheon loan +2) Cash port 13) Smile Loan 14) Credit day 15) Cash today 16) Lucky Rupee 17) Go Cash 18) Snapit Loan (9) Loan Zone 20) Quick Cash 21) panda rupees 22) Play cash 23) Dhani 24) Lazy Pay 25) Loan Tap 26) IPPB Mobile 27) Micredit 28) Quick Credit 29) Cashon 30) Rupees Plus 31) Rupee Now 32) Elephant Loan 33) Ant cash 34) Quick Money and 35) Alp | Clash మొదలగు అనేక చట్టవిరుద్ద ఆన్ లైన్  ఋణ అప్ వివిధ యాప్ స్టోర్లలో అందుబాటులో ఉన్నాయని  రిజర్వ్  బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గుర్తించి ప్రజలను అప్రమత్తం చేస్తూ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేయడం జరిగింది. RBI సూచించిన 600 యాప్ లను చట్ట విరుద్ధమని తెలియజేసింది. వాటి వివరాలు (RBI Website లో చూడవలసినదిగా ప్రజలను కోరుతున్నాము

డాక్యుమెంట్లతో పనిలేకుండా చిటికెలో లోన్లు ఇస్తామంటూ వలవేస్తున్న అప్  నమ్మరాదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రజలను అప్రమత్తం చేసింది ప్రాధమికంగా దేశంలో 137 ఫేక్ ఋణ యాప్స్ భారత దేశంలో NBFC వ్యాపారానికి సంబంధించిన ఎలాంటి అనుమతులు లేకుండా చైనా లింకుతో నడుస్తున్నాయని ఆర్బీఐ గుర్తించింది. సదరు ఫేక్ ఋణ యాప్స్ జాబితాపై రాష్ట్ర పోలీస్ శాఖ సోషల్ మీడియా వేదికల ద్వారా యువతకు, మోసపోతున్న బాధితులకు అవగాహన కల్పిస్తోంది. ప్రతి ఒక్కరు ఋణ యాప్ డౌన్లోడ్ చేసుకునే ముందు. ఆ యాప్ ఆర్బీఐతో నమోదు చేసుకున్న NBFC లో నమోదు చేసుకొని ఉందా లేదా అని పూర్తి వివరాలు. యాప్ పేరు, దాని రేటింగ్స్ యాప్ స్టోర్లో సమీక్షలు ఇతర వివరాలను ధ్రువీకరించుకోవాలి ఋణం కోసం దరఖాస్తు చేసుకునేముందు https://rbi.org.in/scripts/bs nbfclist.aspx ను సందర్శించి మీరు డౌన్లోడ్ చేయు ఋలు యాప్ నకిలీదా? నిజమైనదా? అన్నది తెలుసుకోవాలి ఋణ యాప్లు ఇన్స్టాల్ చేసేటప్పుడు మీ మొబైల్ ఫోన్ యొక్క డాంటాక్ట్స్, కెమెరా లొకేషన్. ఎస్. మ్.ఎస్ స్టోరేజి మరియు ఇతర అనుమతులను ఇవ్వరాదు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు 75 అక్రమ ఋణ యాప్ వేధింపులు కేసులు నమోదు కాగా అందులో 80 మందిని గుర్తించి వారిని అరెస్టు చేయడం జరిగింది మిగిలిన కేసులు దర్యాప్తు దశలో ఉన్నాయి.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ ఎటువంటి నేరాలు జరగకుండా ఉండేందుకు ప్రత్యేకంగా మోసపూరిత/ అక్రమ ఋణ యాప్ల ల పై దృష్టి సారించింది వాటిని బ్యాన్ చేయడం కోసం పోలీస్ శాఖ చర్యలు తీసుకొంటుంది. ఇలాంటి నేరాలు పాల్పడినవారిపై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తుందని, చట్టపరంగా వారిపై సెక్షన్లు 384 (ఎక్స్ ట్రాక్షన్), 406 (క్రిమినల్ బ్రీచ్ అఫ్ ట్రస్ట్), 420 (మోసం), 306 (ఆత్మహత్యకు ప్రేరేపించడం), 504 (శాంతి భంగం కలిగించే ఉద్దేశ్యంతో ఉద్దేశపూర్వకంగా అవమానించడం), IPC 506 (నేరపూరిత బెదిరింపు), Prevention of Money Laundering Act, మరియు గాగా చట్టంలోని సెక్షన్ 67. The Companies Act. AP Money Lenders Act మరియు ఇతర సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేయడం జరుగుతుంది.

లోన్  యాప్ కేసులలో ఋణ యాప్ డెవలపర్లు కూడా నేరస్తులు గాని పరిగణించబడుతుంది. ఋణ యాప్ పబ్లిషింగ్ చేయు ప్లే  స్టోర్స్ whatsapp  మరియు ఇతర మాధ్యమాలలో షేర్ చేయవారిని కూడా నేరస్థులుగాని పరిగణి జరుగుతుంది. ఋణ యాపులను సపోర్ట్ చేయి సర్వీస్ ప్రొవైడర్స్ ను బ్యాంక్ KYC  ని సరిగ్గా తనిఖీ చేయని  అధికారులను, కరెంట్ అకౌంట్లో ఎక్కువ మొత్తంలో లావాదేవీలు, అనుమానాస్పద లావాదేవీలు గురించి పోలీసులకు తెలియజేయని బ్యాంకులు మరియు చెల్లింపు మాధ్యమాలను కూడా నేరస్థులుగానే పరిగణించబడుతుంది.ఋణాలను వసూలు చేయుటకు కాల్ చేస్తున్నవారు మరియు బ్యాంక్ అకౌంట్ లను లావాదేవీలు చేయుటకు అద్దెకిస్తున్న వారిపై చట్టరీత్య చర్యలు తీసుకోబడుతుంది.

లోన్ అప్ బాధితులు ఎవరైనా సరే  టోల్ ఫ్రీ నెంబరు 1930కి ఫిర్యాదు చేయగలరు తెలియని వెబ్ సైట్లు, లింక్ ల ద్వార ఎటువంటి ఋణ అప్ డౌన్లోడ్ చేయవద్దని తెలిపారు.

బెదిరింపు కాల్స్/ SMS/ ఫోటో మార్పింగ్ లకు బయపడి అధిక మొత్తలను చెల్లించడం ఆత్మహత్యలకు పాల్పడవద్దని తెలిపారు. ఇటువంటివి సంఘటనలు ఎదురైనప్పుడు మీ దగ్గరలోని పోలీస్ స్టేషన్ లో లేదా టోల్ ఫ్రీ నెంబరు 1930 కి ఫిర్యాదు చేయగలరని DGP తెలిపారు.

ఈ సందర్భంగా DGP ఋణ అప్ కేసుల దర్యాప్తు కోసం ఎస్‌ఓ‌పి (S.O.P), Action plan మరియు మార్గదర్శకాలను విడుదల చేయడం జరిగింది.

Related posts

ఏపి మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్య (హత్య?)

Satyam NEWS

మరో లాక్ డౌన్ తప్పదు…సీసీఎంబి డైరెక్టర్ సంచలన వార్త!

Sub Editor

దళితులు కాంగ్రెస్ పార్టీకి రక్షణగా ఉండాలి

Satyam NEWS

Leave a Comment