30.7 C
Hyderabad
April 19, 2024 09: 17 AM
Slider హైదరాబాద్

వర్షాలు కాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు వల్ల ప్రమాదాలు

#golnaka

వర్షాలు కాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు వల్ల ప్రమాదాలు ఉంటాయని, తగుజాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు గోల్నాక డివిజన్ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్   తెలియజేశారు. ఏదైనా సమస్యలు ఉంటే స్థానికంగా ఉన్నబస్తీ దావాఖానాలలో ఎప్పటికప్పుడు హెల్త్ చెకప్ చేసుకోవాలని కోరారు. అదేవిధంగా బస్తీలు, కాలనీలో  దోమల నివారణకై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని తెలిపారు. స్థానిక ప్రజలు కూడా అదే విధంగా శ్రద్ధ తీసుకోవాలని కోరారు.

గోల్నాక డివిజన్లో సీజనల్ వ్యాధి సంబంధించి హెల్త్ క్యాంప్ నిర్వహించి స్థానిక ప్రజలకు మందులను అందజేశారు. బస్తీలో పాదయాత్ర నిర్వహించి మలేరియా డెంగీ వ్యాధులకు సంబంధించి స్థానిక ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నరేందర్ రెడ్డి, మలేరియా సూపర్వైజర్ డాక్టర్ గోవర్ధన్ రెడ్డి, మలేరియా డిపార్ట్మెంట్ ఏ.ఈ. అంబిక, ఈ.ఎఫ్.ఏ. వెంకటయ్య, ఆశవర్కర్లు, మలేరియా సిబ్బంది, దుర్గా నగర్ బస్తి కమిటీ అధ్యక్షులు అంజయ్య, లక్ష్మయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట

Related posts

కరోనా నుంచి ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసమే లాక్ డౌన్

Satyam NEWS

పల్నాడు జిల్లాలో ఫేమస్ డాక్టర్ మిస్సింగ్ కలకలం

Bhavani

సస్టెయిన్ కార్ట్ ప్రారంభించిన అక్కినేని నాగార్జున

Satyam NEWS

Leave a Comment