శత జయంతి ఉత్సవాల్లో భాగంగా శ్రీ అన్నపూర్ణా సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు కన్నుల పండువగా జరిగాయి. భద్రాచలం శివాలయంలో శత జయంతి ఉత్సవాలను మూడు రోజుల పాటు కాపా వంశీయులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ముందుగా శ్రీ గణపతి పూజ, గోపూజ, అఖండ స్ధాపన, రుద్రపాశుపత హోమం,పూర్ణాహుతి తదితర పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ప్రతిఒక్కరు చల్లగా ఉండాలని, అయ్యప్పస్వామి,సుబ్రహ్మణ్య హోమం అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించారు.
ట్రస్ట్ నిర్వాహకులు కాపా వంశీయులు మాట్లాడుతూ 100సంవత్సరముల క్రితం భద్రాద్రి శ్రీ రామచంద్రుల వారు నడయాడిన ప్రదేశంలో ప్రతిష్ట చేయబడిన శ్రీ అన్నపూర్ణా సమేత శ్రీ రామలిగేశ్వర స్వామి వార్ల అలయం భక్తుల పాలిట కొంగుబంగారంగా అత్యంత మహిమాన్వత క్షేత్రంగా ప్రసిద్దిగాంచిందన్నారు. తమ పూర్వికులు 100 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ దేవాలయం, మఠం వలన మేమం ఎంతో మంది భక్తులకు భోజన సౌకర్యం, వసతి సౌకర్యం కల్పిచడం అనందంగా ఉందన్నారు. ఈ సందర్బంగా పలువురు అద్యాత్మిక పండితులు మాట్లాడుతూ కాపా వంశీయుల చేస్తున్న సేవలు వెలకట్టలేనివని తెలిపారు. అనంతరం, ట్రస్ట్ చైర్మన్ కాపా రామసీతమ్మ,కాపా కృష్ణప్రసాద్,కాపా రవీంధ్రనాధ్,కాపా భాను ప్రసాద్ లు స్వామి వారి చెంత సేవ చేయడం తమకు పూర్వీకులు అందించి అదృష్టమని వివరించారు
ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని, ప్రస్తుతం ఎటువంటి లోటు లేకుండా ఆలయాన్ని అభివృద్ది చేశామన్నారు చివరి రోజు నందిగామ ఎంఎల్ఏ మొండితొక జగన్ మొహనరావు, ఎంఎల్సీ అరుణ్ కుమార్ ,మాజీ ఎంఎల్ ఏ తంగిరాల సౌమ్య ,తదితర అద్యాత్మిక వేత్తలు, ప్రముఖులు, రెండు తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకోని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబంలోని ప్రతి ఒక్క సభ్యులు,భక్తుల సహాయ సహకారాలతోనే ఉత్సవాలు ఘనంగా జరిగాయని తెలిపారు. ఆలయంలో పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహించారు.