33.2 C
Hyderabad
April 26, 2024 02: 46 AM
Slider ముఖ్యంశాలు

ఘనంగా భగీరథ జయంతి వేడుకలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ వైతాళికులను ఘనంగా స్మరించుకుంటుంది, అందులో భాగంగా నేడు రవీంద్రభారతిలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భగీరథ మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై భగీరథ మహర్షికి ఘనంగా జయంతి నివాళులు అర్పించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం హాజరైన బీసీలు, సగర సంఘాల నేతలను ఉద్దేశించి మంత్రి గంగుల మాట్లాడుతూ బీసీ సంక్షేమంలో దేశానికి ఆదర్శంగా తెలంగాణ నిలిచిందని తెలంగాణ ప్రభుత్వం వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని, 310 బీసీ గురుకులాలను ప్రపంచస్థాయిలో నిర్వహిస్తున్నామన్నారు, బీసీల ఆత్మగౌరవం కోసం వేల కోట్ల విలువైన కోకాపేట్, ఉప్పల్ భగాయత్ లాంటి ప్రాంతాల్లో 41 కుల సంఘాలకు 87.3 ఎకరాల్లో 95 కోట్లతో ఆత్మగౌరవ భవనాలను నిర్మిస్తున్నామన్నారు.

భగీరథ మహర్షి వారసులైన సగరులకు సైతం కోకాపేట్ లో రెండు ఎకరాలను కేటాయించడమే కాకుండా రెండు కోట్ల నిధులను సైతం ఆత్మగౌరవ భవన నిర్మాణం కోసం వెచ్చించామన్నారు. నాడు దివి నుంచి గంగను భువికి తరలించిన భగీరథ మహర్షి తపస్సు వలె నేడు పైన పారుతున్న గోదావరిని కాలేశ్వరంతో పైకి ఉరకలెక్కించి తెలంగాణలోని ప్రతి పంట పొలానికి అపర భగీరథుని వలె కేసీఆర్ గారు నిరంధించారన్నారు. తెలంగాణలో ప్రతి ఇంటికి పైప్ లైన్ ల ద్వారా సురక్షిత తాగు నిరంధించే అత్యుత్తమ కార్యక్రమానికి మిషన్ భగీరథ పేరు పెట్టుకున్నామన్నారు మంత్రి గంగుల కమలాకర్.

ఈ కార్యక్రమంలో మంత్రి గంగులను ఘనంగా డప్పు వాయిద్యాల మధ్య ఆహ్వానించి కార్యక్రమానంతరం శాలువాతో ఘనంగా సత్కరించి జ్ఞాపికాను అందజేశారు సగర సంఘాల నేతలు

ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, సగర సంగం అధ్యక్షుడు శేఖర్, బీసీ సంక్షేమ శాఖ అధికారులు, బిసి సంఘాల నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related posts

మా వద్ద 24 గంటలు ఇసుక సప్లయ్ చేయబడును

Satyam NEWS

దేవీ శ‌ర‌న్న‌వరాత్రుల సంద‌ర్బంగా ఆధ్యాత్మిక ప్ర‌వ‌చనం…!

Satyam NEWS

ఈ రెండు తెలుగు రాష్టాలకు ఏమైంది?

Satyam NEWS

Leave a Comment