28.7 C
Hyderabad
April 17, 2024 02: 56 AM
Slider గుంటూరు

27 న జరిగే భారత్ బంద్ జయప్రదం చేయండి

#schemeworkers

స్కీం వర్కర్స్ అందరికీ నెలకి కనీస వేతనం ఇరవై ఒకటి వేలు ఇవ్వాలని శ్రామిక మహిళా సమన్వయ కమిటీ గుంటూరు  జిల్లా కన్వీనర్ డి.శివకుమారి, సిఐటియు మండల కార్యదర్శి యస్.కె.సిలార్ మసూద్ డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా జరిగిన స్కీం వర్కర్స్ సమ్మె లో భాగంగా నర్సరావుపేటలో శుక్రవారం మునిసిపల్ కార్యాలయం నుండి ర్యాలీ గా బయలుదేరి MRO కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది.

అనంతరం MRO కార్యాలయం అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ నిరసన సమ్మె కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ పథకం అమలు జరపాలన్నా స్కీం వర్కర్సే కీలకపాత్ర వహిస్తారని,వారికి మాత్రం కనీస వేతనాలు అమలు జరగడం లేదని వారన్నారు.

నిత్యావసర సరుకుల  ధరలతో పాటు అన్ని సరుకుల ధరలు నిరంతరం పెంచుతూ, స్కీం లోని పథకాలకు మాత్రం కేంద్రం బడ్జెట్ తగ్గిస్తుందన్నారు. స్కీం వర్కర్లు ప్రభుత్వ ఉద్యోగులని సంక్షేమ పథకాలు అమలుచేయటం లేదని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండానే రిటైర్ చేస్తున్నారని, వారికి పిఎప్.ఇఎస్ఐ పెన్షన్ సౌకర్యాలు లేవని,పది వేలు వేతనం వస్తుందని ఉన్న రేషన్ కార్డులు రద్దు చేయాలని చూస్తుందన్నారు.

ఉద్యోగ భద్రత కల్పించి ,పిఎప్.ఇఎస్.ఐ కల్పించాలని, కనీస వేతనం ఇరవై ఒకటి వేలు ఇచ్చి, స్కీం వర్కర్స్ అందరినీ రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని రైతాంగం పాలిట శాపంగా మారిన వ్యవసాయ నల్ల చట్టాలను, విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని ఈనెల 27 వ తేదీ సోమవారం జరుగుతున్న భారత్ బందులో స్కీం వర్కర్స్ అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

ఈ సమ్మెకు సమైక్య ఆంద్రప్రదేశ్ ముస్లిం జేఏసీ రాష్ట్ర కన్వీనర్ యస్ కె. జిలాని మాలిక్, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కామినేని రామారావు మద్దతుగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ప్రాజెక్టు యూనియన్ కార్యదర్శి బి.నిర్మల,ఆశవర్కర్స్ యూనియన్ అధ్యక్ష,కార్యదర్శులు యు.సత్యవతి.నీరజకుమారి,వెంకటరమణ, ఎలీనా, గోవిందమ్మ తదితరులు పాల్గొన్నారు.

Related posts

కొత్త రాజకీయం: టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టేందుకు సిద్ధమైన వైసీపీ

Satyam NEWS

బెంగుళూరులో విపక్ష కూటమి నమావేశం రేపు

Satyam NEWS

ఏపీ రాష్ట్ర స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ లో ఉత్త‌రాంద్ర వాసి….!

Satyam NEWS

Leave a Comment