27.7 C
Hyderabad
April 26, 2024 04: 56 AM
Slider జాతీయం

మధ్యప్రదేశ్ లోకి ప్రవేశించిన భారత్ జోడో యాత్ర

#bharatjodo

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో ఉంది. రాహుల్ గాంధీ యాత్ర మహారాష్ట్రలోని జల్గావ్ జమోద్ గ్రామం మీదుగా బుర్హాన్‌పూర్ మీదుగా మధ్యప్రదేశ్‌లోకి ప్రవేశించింది. రాహుల్ గాంధీకి స్వాగతం పలికేందుకు ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్వాగత అనంతరం అక్కడ ఉన్న ప్రజలను, పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగించారు.

ఆయన ప్రసంగిస్తున్న కొన్ని నిమిషాల వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రాహుల్ తన పాదయాత్ర గురించి వివరించారు. ‘సోదరులారా, ఇప్పుడు కమల్ నాథ్ జీ నన్ను అడిగారు, రాహుల్, మీరు అలసిపోలేదా? అని. సోదర సోదరీమణులారా, నా ముఖం అలసిపోయినట్లు కనిపిస్తోందా?. రెండు వేల కిలోమీటర్లు నడిచాను. అలసట లేదు, ఒక్క క్షణం కూడా అలసట లేదు, నేను మీకు చెప్తున్నాను, ఉదయం లేవగానే నడక ప్రారంభిస్తాను.

నేను ఉదయం 6 గంటలకు నడక ప్రారంభిస్తే రాత్రి 8 గంటలకు మరింత వేగంగా నడుస్తాను. ఎందుకు ఇలా జరుగుతోందంటే మీ అభిమానం. అంతే. రాహుల్ గాంధీ ఈ మాటలు విన్న జనాలు రాహుల్ గాంధీ జిందాబాద్ అంటూ నినాదాలు చేయడం ప్రారంభించారు. రాహుల్ గాంధీ కాసేపు ఆగి, ప్రజలను అగమని అడిగారు. మళ్లీ మోదీ స్టయిల్ లో ప్రసంగం ప్రారంభించడంతో జనం ఘొల్లుమని నవ్వారు.

Related posts

డివైన్ వర్డ్: మహాభారత కావ్య పఠనం ముక్తి కి మార్గం

Satyam NEWS

గణేష్ నిమజ్జనానికి కోవిడ్ నిబంధనల పాటించాలి

Satyam NEWS

అకాల వర్షాలతో నష్టపోయిన పంట పొలాల పరిశీలన

Satyam NEWS

Leave a Comment